Three Men Sexually Assaulted the Boy in Palnadu District : పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాయపాలెంలో ఓ బాలుడిపై ముగ్గురు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టారు. నిందితులంతా వలస కూలీలు కాగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లో బాలుడిపై హత్యాచారం.. నిందితుడికి కఠిన శిక్ష!
Boy Gang Rape : పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామానికి మిర్చి పనుల నిమిత్తం ప్రకాశం జిల్లా సంతమాగులూరు గ్రామం నుంచి కొంత మంది కూలీలు వలస వచ్చారు. కొన్నాళ్లుగా కూలీలు పనుల్లో నిమగ్నం కాగా మూడు రోజుల కిందట దారుణం జరిగింది. కూలీల కుటుంబానికే చెందిన 12 సంవత్సరాల బాలుడు బహిర్భూమికి వెళ్లిన సమయంలో అదే గ్రామానికి వచ్చిన వలస కూలీలు లైంగికదాడికి పాల్పడ్డారు.
21 ఏళ్ల యువతిపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారయత్నం
వెంకటాయపాలెం రైతులు ఏటా మిర్చి కోతల కోసం తెలంగాణతో పాటు రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలైన ప్రకాశం జిల్లా నుంచి కూలీలను రప్పిస్తుంటారు. ఈ క్రమంలో ఈ సీజన్లో మిర్చి కోతలకు ఇతర గ్రామాల నుంచి కూలీలు వచ్చారు. కొన్నాళ్ల పాటు స్థానికంగానే మకాం ఉంటూ పనులు పూర్తికాగానే తిరిగి స్వగ్రామానికి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా సంతమాగులూరు గ్రామం నుంచి పలు కుటుంబాలు ఇక్కడికి వలస వచ్చాయి. మూడు రోజుల క్రితం బాలుడిపై లైంగిక దాడి జరగగా ఆలస్యంగా ఈ విషయం బయటకు పొక్కింది. బాధిత కుటుంబ సభ్యుల ఆందోళనతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. నిందితులతో రాజీకి ఒప్పించి బాలుడికి ఆరోగ్యం బాగు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, మూడు రోజులుగా బాలుడు అనారోగ్యంతో ఉన్నాడని, తీరా ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకో పో అని వదిలేశారని తల్లిదండ్రులు వాపోతున్నారు.
అమానవీయం.. గోవుపై కామాంధుని అఘాయిత్యం.. ఊపిరాడక మూగజీవి మృతి..!
బాలుడికి రక్తస్రావం ఎక్కువ కావడంతో చికిత్స కోసం సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు కన్నీళ్లతో వేడుకుంటున్నారు.