ETV Bharat / state

తెలంగాణ కొత్త లోగో ఇదే ! - సోషల్ మీడియాలో ఫొటో వైరల్‌ - TELANGANA NEW EMBLEM PHOTO VIRAL

Telangana New Emblem : తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం అంటూ అనధికారికంగా సోషల్ మీడియాలో ఓ లోగో వైరల్ అవుతోంది. ఈ లోగోలో నాలుగు సింహాల రాజముద్ర పైన ఉండగా, కింద అమరవీరుల స్థూపం దానికి రెండు వైపుల వ్యవసాయాన్ని ప్రతిబింబించేలా వరి కంకులు అమర్చారు. ఈ నూతన లోగోను ఓసారి మీరూ చూసేయండి.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 2:58 PM IST

Telangana New State Logo
TELANGANA NEW EMBLEM PHOTO VIRAL (ETV Bharat)

Telangana New State Logo : తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని వైభవంగా జరిపేందుకు ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్​గా రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం నిలవనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణను స్వల్ప మార్పులతో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి స్వరపరుస్తున్న విషయం తెలిసిందే. ఇక అధికారిక చిహ్నంలోనూ పలుమార్పులు చేయనున్నట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందులో రాచరికపు గుర్తులు తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

TELANGANA NEW EMBLEM PHOTO VIRAL

రాజధాని నుంచి సామగ్రి తరలింపు - ప్రభుత్వం తీరుపై అమరావతి రైతుల తీవ్ర ఆగ్రహం

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అధికారిక చిహ్నం తుది రూపుపై తన నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం రోజున సమీక్ష నిర్వహించి చిహ్నంలో మార్పులు చేర్పులపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చిహ్నంలో రాచరికపు గుర్తులున్నాయని, వాటిని తొలగించాలని ఇప్పటికే ఆ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రజలు, ప్రజా జీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిహ్నాన్ని కూడా జూన్‌ 2వ తేదీన ఆవిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Telangana New Emblem Photo Viral : ఈ నేపథ్యంలోనే పలు గుర్తులను తొలగించి కొత్త లోగో తయారు చేసినట్లు సమాచారం. కళాకారుడు రుద్రరాజేశం ఇప్పటికే పలు డిజైన్లు రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి చూపించగా అందులో ఓ డిజైన్​ను ఫైనల్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర చిహ్నానికి సంబంధించి ఇప్పుడు ఒక లోగో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే అధికారిక రాజముద్ర అంటూ నెట్టింట అనధికార ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రంలో చెలరేగిపోతున్న మట్టిమాఫియా - చోద్యం చూస్తున్న అధికారులు - Illegal Gravel Mining

ఈ కొత్త చిహ్నంలో నాలుగు సింహాల రాజముద్ర పైన ఉండగా కింద అమరవీరుల స్థూపాన్ని అమర్చారు. ఇక తెలంగాణ వ్యవసాయ రాష్ట్రం కాబట్టి ఆ రంగం ప్రతిబింబించేలా వరి కంకుల గుర్తులను అమరుల స్థూపానికి ఇరువైపులా ఉంచారు. ఇక ఈ లోగో జాతీయ జెండా రంగులో కనిపించేలా రూపొందించగా, తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో రాసి ఉన్నాయి.

'మా దగ్గర పెట్టుబడి పెట్టండి లాభాలు దండుకోండి'- తుక్కు వ్యాపారి బంపర్​ ఆఫర్​తో ఏం జరిగిందంటే! - Scrap Merchant Cheating

Telangana State New Logo Unveiling Postponed : తెలంగాణ అధికార చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. తొలుత జూన్ 2న నూతన అధికార చిహ్నాన్ని విడుదల చేయాలని భావించిన ప్రభుత్వం, దీనిపై మరింత సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. 200 వరకు సూచనలు రావడంతో మరిన్ని చర్చలు జరపాలని నిర్ణయించింది. చర్చల తర్వాతే అధికార చిహ్నం ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా స్పష్టత రాలేదు. జూన్‌ 2న జరగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర అధికార గీతాన్ని మాత్రమే ఆవిష్కరించనున్నట్లు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.