TG Minister Tummala Nageswarao Impatience on AP Roads: రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నామంటూ నిత్యం డప్పు కొట్టుకుంటున్న వైఎస్సార్సీపీ నేతలకు అసలు అభివృద్ధి అనే పదానికి అర్థం అంటే ఏంటో తెలుసా ? మాట్లాడితే చాలు ప్రజల ఖాతాల్లో నేరుగా వేల కోట్ల రూపాయలు వేశామంటున్న జగన్ రహదారులను బాగు చేసే బటన్ ఎందుకు నొక్కట్లేదు ? గ్రామ స్వరాజ్యం అంటూ ప్రజలను మభ్యపెడుతున్న పాలకులు కనీసం రోడ్లపై గుంతల్లో తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవు. అల్లూరి జిల్లాలోని ఎటపాక- కన్నాయిగూడెం రహదారే ఇందుకు నిదర్శనం. ఇదే రోడ్డుపై బుధవారం తెలంగాణ మంత్రి ప్రయాణించగా ఆయన అసహనానికి గురయ్యారు.
అల్లూరి జిల్లాలోని ఎటపాక - కన్నాయిగూడెం మధ్యలో ఆర్‌అండ్‌బీ రోడ్డు నిండా గోతులే ఉన్నాయి. 'ఈ రోడ్డు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవని' తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ రోడ్డును మీరు మరమ్మతులు చేయిస్తారా లేదంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా అని తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్‌అండ్‌బీ అధికారిని ప్రశ్నించారు. మంత్రి తుమ్మల బుధవారం భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్తూ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక- కన్నాయిగూడెం రహదారిలో ప్రయాణించారు.
ఎదురుగా బండొస్తే గల్లంతే- కరకట్ట దారిలో కాచుకున్న మృత్యువు! - People Problems with Damaged Roads
ఎటపాక, చింతలగూడెం, కన్నాయిగూడెం ప్రాంతాల్లో పెద్దపెద్ద గుంతలు ఉండటంతో తుమ్మల అసహనం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే ఏపీ ఆర్‌అండ్‌బీ సీఈ శ్రీనివాసరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ మార్గంలో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 8వ కిలో మీటర్లు అధ్వానంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆర్‌అండ్‌బీ మంత్రిగా పని చేశానని తుమ్మల అన్నారు. దుమ్ముగూడెం - చర్ల రోడ్డు పనులు చేయిస్తున్నప్పుడే ఎటపాక నుంచి కన్నాయిగూడెం గ్రామాల మధ్య ఈ 8 కి.మీ. దూరం రోడ్డు వేయించాను. ఆ తర్వాత కనీసం మరమ్మతులు కూడా చేయించినట్లు లేదని ఆయన అన్నారు. మీరు చేయలేకపోతే మేమే మా రాష్ట్ర నిధులతో ప్యాచ్ వర్క్స్ చేయిస్తామని తెలంగాణ మంత్రి అన్నారు. తెలంగాణ ప్రజలకు కూడా ఈ రోడ్డుపై ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉందని సీఈకి చెప్పారు. మంత్రి ఫోన్‌కాల్‌పై స్పందించిన సీఈ శ్రీనివాసరెడ్డి త్వరలో మరమ్మతులు చేస్తామని ఆయనతో చెప్పారు.
అడుగుకో గొయ్యి - గజానికో గుంతో అధ్వానంగా రాష్ట్ర రహదారులు - Road conditions in Krishna district