Telangana Man contest In Britain Parliament Elections : బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు వ్యక్తి పోటీ చేస్తుండటం కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. తెలంగాణలోని పూర్వ కరీంనగర్ ప్రస్తుత సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నుంచి లేబర్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా పార్టీ పక్రటించింది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్, బౌండరీ కమిషన్ సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం. ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలెక్టోరల్ కాల్కులస్ ప్రకారం నియోజకవర్గంలో 68 శాతం లేబర్ పార్టీ గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటన్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. భారత్‌లో ఇప్పటికే ఎన్నికలు జరుగుతుండగా ఈ సంవత్సరంలోనే బ్రిటన్, అమెరికాలో సైతం ఎన్నికలు జరగనున్నాయి.
About UDAY NAGARAJU : రష్యా -ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ -పాలస్తీనా సంఘర్షణ, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న బ్రిటన్, అమెరికా ఎన్నికల మీద ప్రపంచ దేశాలు దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఉదయ్ నాగరాజు, హనుమంత రావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వం కలిగి ఉండే ఉదయ్ అంచెలంచలుగా ఎదిగారు. బ్రిటన్‌లోని పప్రంచ పఖ్యాత యూనివర్సిటీ కాలేజీ అఫ్ లండన్‌లో పాలనా శాస్తంలో పీజీ చేశారు.
మంచి వక్తగా గుర్తింపు : పప్రంచ సమాజం, భావితరాలపై ఆర్టీఫీషియల్ ఇంటెలిజన్స్ ప్రభావాన్ని ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీలాబ్స్ అనే థింక్-ట్యాంక్‌ను నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలపైన ఉదయ్‌కు మంచి పట్టు ఉంది. స్కూల్ గవర్నర్‌గా, వాలంటీర్‌గా, విస్తృత రాజకీయ ప్రచారకుడిగా ఒక దశాబ్దకాలంగా ఇంటింటికీ ప్రచారం చేసి సామాన్యుల కష్టాలఫై మంచి అవగాన సాధించారు. క్షేత్రస్థాయి సమస్యలపై చక్కని అవగాహనతో పాటు అంతర్జాతీయ వక్తగా, రచయితగా గుర్తింపు పొందారు. ఇంటింటికీ ప్రచారాలతో సహా వివిధ కమ్యూనిటీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
మాజీ ప్రధాని పీవీతో బంధుత్వం : సామాన్యుడు ఎదుర్కొంటున్న సవాళ్లపై అతనికి అంతర్దృష్టిని అందించింది. ఉదయ్ నాగరాజుకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత రావుతో బంధుత్వం ఉండటం గమనించదగ్గ విషయం, గతంలో బ్రిటన్ పర్యటనలకు వెళ్లినప్పుడు అప్పటి ఐటీ పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీ కవితతో కలిసి పలు కార్యక్రమాల్లోను ఉదయ్ నాగరాజు పాల్గొన్నారు. గత కొన్ని ఎన్నికల్లో లేబర్ పార్టీ ఎంపీలు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన కౌన్సిలర్, రాష్ట్ర మేయర్ ఎన్నికలోనూ లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. దాంతో తెలుగు ముద్దుబిడ్డ ఉదయ్ నాగరాజు కూడా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు బిడ్డ బ్రిటన్ లో ఎంపీగా పోటీ చేస్తుండడం గెలుపు దిశగా పయనించడంతో ఆయన స్వగ్రామంలో హర్షం వ్యక్తం అవుతుంది. తెలుగు బిడ్డ ఆ స్థాయికి వెళ్లినందుకు గర్విస్తున్నారు.