ETV Bharat / state

డ్రగ్స్​ మహమ్మారి తెలంగాణతో పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది : మంత్రి సీతక్క - Tg Govt Conduct world drug day

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 10:07 PM IST

Updated : Jun 26, 2024, 10:51 PM IST

World Drug Day 2024 : రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. యువత డ్రగ్స్​ వైపు వెళ్లవద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు హైదరాబాద్​లోని శిల్ప కళావేదికలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు.

World Drug Day 2024
World Drug Day 2024 (ETV Bharat)

Telangana Govt Conduct International Anti-Drug Day Program : ప్రస్తుత కాలంలో డ్రగ్స్​ మహమ్మారి తెలంగాణతో పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​ శిల్ప కళావేదికలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్​ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమెతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, డీజీపీ రవిగుప్తా, టీజీన్యాబ్​ డైరెక్టర్​ సందీప్​ శాండిల్య, హీరో తేజ సజ్జ, సుమన్​, మాజీ మహిళా క్రికెటర్​ మిథాలి రాజ్​, సీనియర్​ ఐపీఎస్​ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మాదకద్రవ్యాల బారిన పడి ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్​కు అలవాటు పడితే సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఎదురవుతుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్​ మాఫియా కోట్లు సంపాదిస్తుందని చెప్పారు. డ్రగ్స్​ మత్తులో బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలిచ్చారని గుర్తు చేశారు.

మానవుడిగా పుట్టడం గొప్ప అదృష్టం : అన్నింటికంటే మానవుడిగా పుట్టడం అదృష్టమని ఎక్సైజ్​ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. జీవితంలో ఉన్నత స్థానాలకు రావాలని కలలు కనాలని, వాటిని నిజం చేసుకోవాలని చెప్పారు. కానీ కొందరు డ్రగ్స్​ మహమ్మారి ఊబిలో చిక్కుకుంటున్నారని ఆందోళన చెందారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా, సరఫరా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్​ చిరంజీవి అవగాహన కల్పిస్తున్న ఓ వీడియోను విడుదల చేశారు. గతంలో నార్కొటిక్​ ఎస్పీగా పని చేసిన ఎగ్గడి భాస్కర్​ రాసిన గీతాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు విడుదల చేశారు.

"తెలంగాణతో పాటు ప్రపంచాన్ని డ్రగ్స్​ మహమ్మారి గడగడలాడిస్తోంది. ఈ మాదక ద్రవ్యాలకు బానిసైన వారు సమాజానికి పనికి రారు. జీవితంలో డ్రగ్స్​ ఒక్కటే ఆనందాన్ని ఇవ్వదు. డ్రగ్స్​ బారిన పడి చాలా జీవితాలు నాశనం అయ్యాయి. అలాగే వారి కుటుంబాలు కూడా ఛిన్నాభిన్నం అయ్యాయి. డ్రగ్స్​కు అలవాటు పడితే సమాజంలో తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్​ మాఫియా కోట్లు సంపాదిస్తుంది. మాదకద్రవ్యాల మత్తులో ఆడవాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. సీఎం రేవంత్​ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలిరోజు నుంచే డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపారు." - సీతక్క, మంత్రి

మత్తువదలరా - డ్రగ్స్ మహమ్మారిపై కదం తొక్కిన తెలంగాణ - Anti Drug Rally in Telangana

పోలీసులు మాత్రమే డ్రగ్స్ కంట్రోల్ చేయలేరు - ప్రజలూ సహకరించాలి : భట్టి విక్రమార్క - BHATTI VIKRAMARKA ON DRUGS SUPPLY

Last Updated : Jun 26, 2024, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.