ETV Bharat / state

రాష్ట్రానికి తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ - సీఎం చంద్రబాబుతో భేటీ - Telangana Governor Meets CM CBN

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 2:00 PM IST

Telangana Governor CP Radhakrishnan Meets AP CM CBN : తెలంగాణ గవర్నర్​ ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు ఉండవల్లిలోని ఆయన ఇంట్లో భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో మంత్రి లోకేశ్​ గవర్నర్​కు స్వాగతం పలికారు.

telangana_governor_cp_radhakrishnan_meets_ap_cm_cbn
telangana_governor_cp_radhakrishnan_meets_ap_cm_cbn (ETV Bharat)

Telangana Governor CP Radhakrishnan Meets AP CM CBN : తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్​ పర్యటనకు వచ్చారు. గవర్నర్ రాధాకృష్ణన్​ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇంటికి తేనేటి విందుకు ఆహ్వానించారు. సీఎం ఆహ్వానం మేరకు గవర్నర్ రాధాకృష్ణన్ చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Telangana Governor CP Radhakrishnan Meets AP CM CBN
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ (ETV Bharat)

తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆయనను లోకేశ్​ సాదరంగా ఆహ్వానించారు. ఈ భేటీ మర్యాదపూర్వకమే అని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే రాధాకృష్ణన్, చంద్రబాబు సమావేశంలో ఇప్పటికీ పరిష్కారం కాని రాష్ట్ర విభజన సమస్యలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ (ETV Bharat)

Telangana Governor CP Radhakrishnan Meets Minister Lokesh : ముఖ్యమంత్రి చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్​కి ఉండవల్లి నివాసం వద్ద మంత్రి నారా లోకేశ్​ సాదర స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో గవర్నర్‌ని సత్కరించారు. తన నియోజకవర్గం మంగళగిరి చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు మంత్రి నారా లోకేశ్​ ప్రతి సందర్భాన్ని వినియోగించుకుంటున్నారని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Telangana Governor CP Radhakrishnan Meets minister
నారా లోకేశ్​తో తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ (ETV Bharat)

రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. పెండింగులో ఉన్న విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని చంద్రబాబును, సీఎం రేవంత్‌ ఇంతకుముందే కోరిన విషయం విదితమే. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌ అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని ఇంతకు ముందే తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి చంద్రబాబును కోరారు.

జూన్​ 2నాటికి తెలంగాణకు పదేళ్లు - స్వాధీనం చేసుకోవాల్సిన భవనాలపై రేవంత్ సర్కార్​ ఫోకస్​ - Bifurcation Issue Of AP And TS

రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులు, పొరుగు రాష్ట్రాలతో అనుసంధానమై ఉన్న మార్గల అభివృద్ధికి తోడ్పడాలని ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు అంశాలపై చర్యలు జరుగుతున్నట్లు సమాచారం. చంద్రబాబు ప్రభుత్వంతో రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు పడతాయని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబు (ETV Bharat)

తెలంగాణకు రిలీవ్‌ చేయాలని ఆ రాష్ట్ర ఉద్యోగుల విజ్ఞప్తి - సీఎస్​కు లేఖ - Telangana Engineers Met CS Nirab

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.