TDP Parliamentary Party Meeting Under Chandrababu Naidu : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ (NTR) భవన్‌లో నేడు పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతను చంద్రబాబు ప్రకటించనున్నారు. ఇప్పటికే రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంటరీ పార్టీ నేత ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై నేటి భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రానికి వీలైనన్నిఎక్కువ కేంద్ర నిధులు తీసుకొచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు ఎంపీ (MP) లకు దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక జరుగుతున్న తొలి శాసనసభ సమావేశాల్లో తొలిరోజు శుక్రవారం ఎక్కడ చూసినా కోలాహలం, ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. శాసనసభ్యుల ప్రమాణాలను చూసేందుకు వారి బంధువులు, సన్నిహితులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మీడియా గ్యాలరీలు, లాబీలు కిటకిటలాడాయి. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనవారి సంఖ్య ఎక్కువగా ఉంది. సీనియర్ నాయకుల్లో గత శాసనసభలో లేనివారు ఈసారి పెద్దసంఖ్యలో ఎన్నికయ్యారు. అధికార కూటమిలోనే 164 మంది సభ్యులు ఉండడంతో పరస్పర అభినందనలు, పరిచయాలు, కుశల ప్రశ్నలతో సందడి నెలకొంది. జూనియర్ ఎమ్మెల్యేలంతా సీనియర్ల వద్దకు వెళ్లి పరిచయాలు చేసుకున్నారు. ప్రతి పక్షం నామమాత్రం కావడం, అధికారపక్ష సభ్యులే అత్యధిక సంఖ్యలో ఉండటంతో పసుపు, కాషాయ, తెలుపు రంగు కండువాలు తళుకులీనాయి. టీడీపీ సభ్యుల్లో చాలామంది. పసుపు చొక్కాలు ధరించి వచ్చారు.
తొలిరోజు సందడిగా శాసన సభ- చంద్రబాబు, పవన్, జగన్ ఎలా స్పందించారంటే! - AP Assembly Sessions 2024
శాసనసభలు జరుగుతున్నాయంటే గత ఐదేళ్లూ ముఖ్యమంత్రి, మంత్రులు రాకపోకలు సాగించే మార్గంలోని రాజధాని గ్రామాల్లో కర్ప్యూ వాతావరణం ఉండేది. సీఎం వస్తున్నారంటే ప్రజలకు ఆయన, ఆయనకు ప్రజలు కనపడకుండా గ్రామాల్లో దారి పొడవునా పోలీసులు తెరలు పట్టుకునేవారు. బారికేడ్లు కట్టేవారు. ఇళ్లలోంచి ఎవర్నీ బయ టకు రానిచ్చేవారు కాదు. అమరావతి ఉద్యమ. శిబిరాల వద్ద భారీ సంఖ్యలో పోలీసులు అడ్డుగా నిలబడేవారు. రాజధాని గ్రామాల ప్రజలకు ఇప్పుడా బాధలు తప్పాయి. రాజధాని గ్రామాల పరిధిలోనూ భద్రత కోసం పోలీసుల్ని మోహరించినా, గతంలో మాదిరిగా ప్రజల్ని ఇబ్బంది. పెట్టడం లేదు.