ETV Bharat / state

గుంటూరులో డయేరియా బాధితలకు న్యాయం చేయాలంటూ టీడీపీ నేతల ఆందోళన! - కలుషిత నీరు తాగి అనారోగ్యం

TDP Leaders on Diarrhea Cases in AP: కలుషిత నీరు తాగి డయేరియా అనుమానిత లక్షణాలతో మృతి చెందిన వారికి న్యాయం చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్​కు మెమోరాండం ఇచ్చిన నేతలు.. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

TDP_Leaders_on_Diarrhea_Cases_in_AP
TDP_Leaders_on_Diarrhea_Cases_in_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 8:10 PM IST

TDP Leaders on Diarrhea Cases in AP: గుంటూరులో కలుషిత నీటి సరఫరాతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకరు మృతి చెందడం, డయేరియా కేసులు రోజు రోజుకూ పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచుతూనే మరోవైపు సరక్షితమైన తాగునీటి సరఫరాపై దృష్టి సారించింది. ఇది ఇలా ఉంటే నగరంలో డయేరియా కేసులు పెరగడంపై విపక్షాలు, ప్రభుత్వంపై దాడిని ఉద్ధృతం చేశాయి. అవినీతి, దోపిడీపై పెట్టే శ్రద్దను ప్రజారోగ్యంపై పెట్టాలని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలుషిత తాగి మృతి చెందిన బాధిత కుటుంబానికి, అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని గుంటూరు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో ప్రజలు ఇంకా కలుషిత నీరుతో డయేరియాకు గురికావడం ప్రభుత్వానికి సిగ్గు చేటని వారు మండిపడ్డారు. వందలాది మంది ఆస్పత్రిపాలవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, తక్షణమమే ఉపశమన చర్యలకు దిగాలని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

డయేరియా అనుమానిత లక్షణాలతో మృతి చెందిన పద్మ కుటుంబానికి పరిహారం అందించాలని మంత్రి విడదల రజిని(Minister Vidadala Rajini) కి గుంటూరు తెలుగుదేశం నేతలు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌కు కూడా మెమోరాండం ఇచ్చారు. కలుషిత నీటి సరఫరా కట్టడికి చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత నసీర్ అహ్మద్(TDP leader Naseer Ahmed) డిమాండ్‌ చేశారు. బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే(MLA)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

జగన్​ ప్రభుత్వం నాసిరకం మద్యమే కాదు-కలుషిత తాగునీరు కూడా సరఫరా చేస్తోంది: నక్కా ఆనంద్​బాబు

TDP Nakka Anand Babu Fire on YSRCP Govt: కలుషిత నీరు తాగి రాష్ట్రంలో వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు(Former Minister Nakka Anand Babu) అన్నారు. ఇంత జరుగుతున్నా ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సురక్షిత తాగునీరు(Drinking Water) అందక మరణాలు సంభవిస్తుంటే సీఎం జగన్‌(CM Jagan) పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డయేరియా కేసులపై(Diarrhea Cases in AP) ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Minister Vidadala Rajini Review with Officials at Collectorate: వాంతులు, విరేచనాలతో గుంటూరు ప్రభుత్వాసుపత్రి(Guntur Govt Hospital)లో చేరిన వారి సంఖ్య 75కు చేరిందని మంత్రి రజిని తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించిన మంత్రి.. నగరంలో ఆరోగ్య పరిస్థితులపై ఇంటింటి సర్వే చేస్తున్నామన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాగునీరు, ఆహార శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపామని, రిపోర్టు రాగానే చర్యలు చేపడతామని రజిని వివరించారు.

మరింతగా పెరిగిన డయేరియా కేసులు- ఆందోళన వద్దంటున్న మంత్రి రజనీ

గుంటూరులో డయేరియా బాధితలకు న్యాయం చేయాలంటూ టీడీపీ నేతల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.