TDP leaders Fire on YSRCP Attacks : వైఎస్సార్సీపీ నాయకుల అరాచకాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలుగుదేశం నేతలు తెలిపారు. పోలీసులు ఇంకా జగన్ కనుసన్నల్లో నడుస్తున్నారని మండిపడ్డారు. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో టీడీపీ కమిటీ పర్యటించి అధినేత చంద్రబాబుకు నివేదిక ఇస్తామని వెల్లడించారు. హింసారాజకీయాలకు పాల్పడిన వైఎస్సార్సీపీకి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.
'ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ మూక దాడులు చేశారు. ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. ఎన్నడూ లేని విధంగా ఊర్లకు ఊర్లు కదిలొచ్చి ఓట్లు వేశారు. బయట ఉన్న వాళ్లు సైతం ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ఉత్సాహం చూపించారు. అది చూసి జగన్మోహన్ తట్టుకోలేక పోతున్నాడు. జగన్‌కి జైలు గుర్తొస్తుంది. అందుకే రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేస్తున్నారు. జగన్ లండన్ వెళ్తూ ఇక్కడ కుట్రలు చేస్తున్నారు. రిజల్ట్ వచ్కేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్రెడ్డి సీఎం కాుదు అని అధికారులందరూ గుర్తుపెట్టుకోవాలి.' - నక్కాఆనంద్‌బాబు, మాజీ మంత్రి
ఓటమి భయంతో ప్లాన్ బీ ప్రవేశ పెట్టిన జగన్‌రెడ్డి పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్సీపీ నేతలు దాడులకు దిగారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు పోలింగ్ బూత్‌లకు ఓటర్లు రాకుండా చేసి గెలవాలని పథకం వేశారని ఆరోపించారు. రాక్షస పాలనను తరిమి కొట్టడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో పెను మార్పు వచ్చిందని భారీగా పోలింగ్ శాతం నమోదైందని, నిరాశలో టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలపై వైఎస్సార్సీపీ నేతలు దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో అల్లర్లపై ఈసీ సీరియస్- సీఎస్, డీజీపీకి సమన్లు జారీ - EC Issued Summons to AP CS and DGP
ఓడిపోతున్నామని వైఎస్సార్సీపీ నేతలు జీర్ణించుకోలేక అరాచకం, విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇనుప రాడ్లు, కర్రలు, ఇతర మారణాయుధాలతో బీభత్సం సృష్టించారని, పులవర్తి నానిపై హత్యాయత్నం, కారంపూడిలో టీడీపీ కార్యాలయం, నేతల ఇళ్లు ధ్వంసం చేశారన్నారు. తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఇంటిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి, సానుభూతిపరుల ఆస్తుల ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇళ్లపైకి దాడులు చేసేందుకు, ఇళ్లు తగబెట్టేందుకు పెట్రోలు క్యాన్ లతో వైఎస్సార్సీపీ గూండాలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కర్రలు, రాడ్లు, బీరు సీసాలతో దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 25 నియోజకవర్గాల్లో వైఎస్సీర్సీపీ మూకలు విధ్వంసం సృష్టించారన్నారు. 119 సంఘటనలు జరిగాయని రాష్ట్రంలో ఈ విధ్వంసంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
పల్నాడులో 144 సెక్షన్- భారీగా పోలీస్ పహారా - attacks in palnadu