Dalit Sankharavam In Rajamahendravaram: రాజమహేంద్రవరంలో తెలుగుదేశం-జనసేన దళిత శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు వైఎస్సార్సీపీ దళిత వ్యతిరేఖ విధానాలపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ దళిత వ్యతిరేకి అని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో దళితులంతా, జగన్కు ఓట్లతోనే బుద్ది చెబుతారని హెచ్చరించారు.
దళితులు, జగన్ మధ్య ఎన్నికలు: దళితుల్ని చంపిన జగన్ ను రాజకీయంగా చంపుతామని తెలుగుదేశం నాయకుడు మహాసేన రాజేశ్ అన్నారు. దళితుల్ని వెంటేసుకొని తిరుగుతున్న వ్యక్తి జగన్ అని ఆరోపించారు. ఈ సారి ఎన్నికలు దళితులు, జగన్ మధ్య జరుగుతున్నాయని అభివర్ణించారు. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలోని గాదాలమ్మ నగర్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించన దళిత శంఖారావం సభలో రాజేష్ పాల్గొని ప్రసంగించారు. జగన్ పాలనపై రాజేష్ విరుచుకుపడ్డారు. దళితుడ్ని లోక్ సభ స్పీకర్ ను చేసిన ఘనత చంద్రబాబుదే అని తెలిపారు. దళితులను చంపేసిన నేరస్తుడు ఎక్కడ జగన్ అని రాజేష్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో దళితులు అధిక మెజారిటీతో టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని మాహాసేన రాజేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నేతల విధ్వంసం - దళితులపై దాడి చేసి, గుడిసెలకు నిప్పుపెట్టిన ఎమ్మెల్యే అనుచరులు
సీఎం జగన్ గత ఎన్నికల్లో ఎస్సీ ఓట్లతో గద్దె ఎక్కారు. ఆయన క్రిస్టియన్ కాదు హిందువు కాదు, ఫక్తు రాజకీయ నాయకుడు. దళితుల అండతో జగన్ అధికారంలోకి వచ్చారు, కానీ, సీఎం జగన్ పాలనలోనే దళితులకు తీవ్ర అన్యాయం జరిగింది. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా, వాటి వల్ల ప్రయోజనం లేదు. కత్తులు, కర్రలతో కాకుండా మనం వేసే ఓటు మాత్రమే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. -జవహర్, మాజీ మంత్రి
రూ.35 వేల కోట్లు దారి మళ్లించారు: మాట తప్పి మడమ తిప్పిన వ్యక్తి జగన్, రూ.35 వేల కోట్లు దారి మళ్లించారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. గత టీడీపీ హయాంలో దళితుల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలను వివరించారు. పలు పథకాల కోసం, కేంద్రం ఇచ్చే డబ్బులు కాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గతంలో దళితుల సంక్షేమానికి టీడీపీ కృషి చేసిందని బుచ్చయ్య తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితులకు సంబంధించిన 27 పథకాలను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళితుల అభివృద్ది కోసం యాక్షన్ ప్లాన్ అంటూ ఉందా అని ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపుల్లో బీసీ, దళిత, గిరిజనులకు సరైన రీతిలో కేటాయింపులు జరగలేదని బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళిత కాలనీపై దండెత్తడమేనా ప్రజాస్వామ్యం: జడ శ్రావణ్ కుమార్