ETV Bharat / state

కోడ్​ ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి - ఈసీకి టీడీపీ నేత షరీఫ్ లేఖలు - TDP Shariff Letters to AP CEO

TDP Leader Shariff Letters to AP CEO: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కొంతమంది అధికారులు వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్నారని, కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారంటూ టీడీపీ సీనియర్ నేత ఎం.ఏ షరీఫ్ విమర్శించారు. ఈ మేరకు ఏపీఎండీసీ అసిస్టెండ్ మేనేజర్, ఏపీ వక్ఫ్ బోర్డుకు చెందిన ఈఆర్ఓపై, ఓ ఉన్నతాధికారిపై ఫిర్యాదు చేస్తూ ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు.

TDP_Leader_Shariff_Letters_To_AP_CEO
TDP_Leader_Shariff_Letters_To_AP_CEO
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 2:09 PM IST

TDP Leader Shariff Letters to AP CEO: ఏపీఎండీసీ (Andhra Pradesh Mineral Development Corporation Ltd) అసిస్టెంట్ మేనేజర్ పి. హేమంత్ కుమార్ రెడ్డి ప్రజా సొమ్మును జీతంగా తీసుకుంటూ వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు (Chief Electoral Officer Mukesh Kumar Meena) టీడీపీ సీనియర్ నేత ఎం.ఏ షరీఫ్ లేఖ రాశారు. హేమంత్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా సైతం వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు.

ప్రజా సొమ్మును జీతంగా తీసుకుంటూ: ఈనెల 23న తిరుపతి నగరంలో వైసీపీ నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బ్రోచర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారని ఆరోపించారు. ఈ నెల 25వ తేదీన పూతలపట్టులో వైసీపీ యూత్ మీటింగ్​లోనూ పాల్గొన్నాడన్నారు. ప్రజా సొమ్మును జీతంగా తీసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్న హేమంత్ కుమార్ రెడ్డిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని షరీఫ్‌ డిమాండ్‌ చేశారు.

ఎన్నికల వేళ వైసీపీ కుట్రలు బట్టబయలు - ఓటర్లకు పంచనున్న చీరలు పట్టివేత - EC SEIZED YSRCP GIFTS

ఎన్నికల కోడ్​ అమలు చేయడంలో వైఫల్యం: ఏపీ వక్ఫ్ బోర్డుకు (Andhra Pradesh Waqf Board) చెందిన ఈఆర్ఓ ఎన్నికల కోడ్​ను అమలు చేయడంలో వైఫల్యం చెందారంటూ టీడీపీ సీనియర్ నేత ఎం.ఏ షరీఫ్ మరో లేఖ రాశారు. డోన్ టౌన్‌లోని ఎడ్గా మసీదు, రాష్ట్రంలోని ఇతర మసీదుల కేర్ టేకర్ కమిటీ ఏర్పాటు ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని తెలిపారు. మంగళగిరిలోని అంజుమన్ గవర్నింగ్ బాడీ వైసీపీకి ఎన్నికల ప్రచారం చేస్తోందన్నారు. గుంటూరు సిటీలోని వక్ఫ్ ఇనిస్టిట్యూట్​కు కేర్ టేకర్ కమిటీ ఏర్పాటు చేయాలంటే గుంటూరు సిటీ వక్ఫ్ ఇన్​స్పెక్టర్​ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డు ప్రధాన ఎగ్జిక్యూటివ్ అధికారి ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించవద్దని ఆదేశించాలని షరీఫ్‌ కోరారు.

ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలి: ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి రాష్ట్రంలోని జాయంట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ తీసుకుని అధికారిక పత్రాలపై జగన్ (YS Jagan Mohan Reddy) బొమ్మ యథావిధిగా కొనసాగించాలని ఆదేశించారన్నారు. ప్రభుత్వ అధికారిక పత్రాలైన పాస్‌బుక్‌లు, భూమి పత్రాలు, ఎల్.పీ.ఎం(Land Parcel Map) లపై జగన్ బొమ్మ, నవరత్నాల లోగోను యథావిధిగా కొనసాగించాలని ఆ అధికారి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆ అధికారి వాట్సాప్‌లో టెక్స్ట్ మెసేజ్‌లు సైతం పంపుతున్నారన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని షరీఫ్‌ కోరారు.

ఎన్నికల వేళ ఈ మీటింగ్​లేలా ? బాధ్యతా - స్వామిభక్తా ? - PraveenPrakash Meeting with Parents

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.