TDP Leader Pattabhi Ram on YSRCP Leaders Attacks: హింసకు పాల్పడటం తెలుగుదేశం విధానం కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ నాయకులు అరాచకాలు సృష్టించారని గుర్తు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలపై లెక్కలేనన్ని దాడులు చేశారన్నారు. లోకేష్ పాదయాత్రకు ఆటంకాలు సృష్టించారని మండిపడ్డారు. ఆనాడు వైఎస్సార్సీపీకి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశమని అన్నారు. కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తే వైఎస్సార్సీపీ చంపుతుందని పట్టాభి మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువల గురించి ఎన్నోసార్లు చంద్రబాబు హితబోధ చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా భౌతికదాడులు జరగవని అన్నారు. ఇకపై వైసీపీ నేతలకి లోకేశ్ రెడ్ బుక్ రియాల్టీ ఏంటో చూపిస్తాని హెచ్చరించారు. ఐపీసీ సెక్షన్ల పవరేంటో చూపిస్తామని అవినీతిపరులైన అధికారులపై చర్యలు తప్పవని పట్టాభి అన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు లోకేశ్ పాదయాత్రపై 22 సార్లు దాడిచేశారని గతంలో చెన్నుపాటి గాంధీపై దాడిచేసి కన్ను పోగొట్టారని అన్నారు. యర్రగొండపాలెం, నందిగామలో చంద్రబాబు పర్యటనలపై దాడిచేశార అన్నారు. తాడిపత్రిలో జేసీ ఇంటిపై ఎన్నిసార్లు దాడులు చేశారో లెక్కేలేదని అలాగే నాపై దాడిచేసినప్పుడు వైఎస్సార్సీపీకి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని పట్టాభి ప్రశ్నించారు.
కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయి. మేము అంతా కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాం. ప్రజాస్వామ్య విలువల గురించి ఎన్నోసార్లు చంద్రబాబు మాకు హితబోధ చేశారు. తెలుగుదేశం హింసను ప్రేరేపించదు అలానే రాష్ట్రంలో ఎక్కడా భౌతికదాడులు జరగవు. ఇకపై లోకేశ్ రెడ్ బుక్ రియాల్టీ ఏంటో, ఐపీసీ సెక్షన్ల పవరేంటో చూపిస్తాం. అలానే అవినీతిపరులైన అధికారులపై చర్యలు తప్పవు. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ నాయకులు అరాచకాలు సృష్టించి టీడీపీ కార్యకర్తలపై లెక్కలేనన్ని దాడులు చేశారు. అప్పుడు వైఎస్సార్సీపీకి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా. లోకేష్ పాదయాత్రపై 22 సార్లు దాడి చేశారు అలానే యర్రగొండపాలెం, నందిగామలో చంద్రబాబు పర్యటనలపై దాడి చేశారు.- పట్టాభి రామ్, టీడీపీ నేత