Taxes In Vijayawada Municipal corporation : నగర జీవనం రోజురోజుకూ మరింత భారంగా మారుతోంది. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు (Employment opportunities) లేక ప్రజలు నగరాలకు వస్తుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ సర్కార్ వివిధ రూపాల్లో తమపై ఆర్థిక భారం మోపుతోందని సామాన్యులు వాపోతున్నారు. భారీగా పన్నులు (Heavy taxes) గుంజుతున్నా కనీస సదుపాయాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'ఆస్తి మూరెడు పన్ను బారెడు'- ప్రజల నడ్డివిరుస్తున్న జగన్ ప్రభుత్వం
People Problems by Taxex in Vijayawada : విజయవాడ నగరంలో ప్రజలపై పాలకులు ఎడాపెడా పన్నుల మోత మోగిస్తున్నారు. జగన్ సర్కార్ (Jagan Govt) కొలువుదీరాక గతంలో ఎన్నడూ లేని విధంగా యూజర్ ఛార్జీలు విధించి, విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి సామాన్యుడి నడ్డివిరుస్తోంది. ప్రభుత్వం (Government) వివిధ పేర్లతో మోయలేని విధంగా పన్నుల భారం వేస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువుల కోసం పెట్చే ఖర్చు గతంతో పోలిస్తే చాలా వరకు పెరిగిందని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. ప్రజలకు కనీస మౌలిక వసతులు (Basic Needs) కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, పారిశుద్ధ్య నిర్వహణను గాలికొదిలేసిందని మండిపడుతున్నారు.
బాబోయ్ మావల్ల కాదంటున్న లారీ యజమానులు - పన్ను భారంతో వృత్తినే వదిలేస్తున్న దయనీయ పరిస్థితి
'జగన్ ఏలుబడిలో ఇంటి పన్ను అనేక రెట్లు పెరిగిందని, ఎప్పుడో వాడిన విద్యుత్‌కు ఇప్పుడు ఛార్జీలు వసూలు చేస్తోందని సామాన్యులు వాపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో కంటే జగన్ (Jagan) ఏలుబడిలో ఇంటిపన్ను అనేక రెట్లు పెరిగింది. సర్ధుబాటు ఛార్జీలు, యూజర్ ఛార్జీల పేరుతో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీల మోత ప్రభుత్వం మోగిస్తోంది. విద్యుత్ సర్దుబాటు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఎప్పుడో దోచుకుంటుంది. భవన నిర్మాణ కార్మికులకు గతంలో మాదిరి చేతి నిండా పని ఉండడం లేదు. దీంతో వారిలో చాలా మంది ఇంటి పనులకు వెళ్తున్నారు.' -టాక్స్ పేయర్స్ అసోసియేషన్
నగరవాసులపై ప్రభుత్వం పన్నుల (Tax) భారం తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. నగరాలకు (City) వలసవెళ్లే వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌పై మండిపడ్డ టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు