ETV Bharat / state

రామోజీ ఫిల్మ్‌సిటీలో సమ్మర్ స్పెషల్ హాలిడే కార్నివాల్‌ - ఇక సందడే సందడి - Ramoji Film City Holiday Carnival - RAMOJI FILM CITY HOLIDAY CARNIVAL

Holiday Carnival at Ramoji Film City 2024 : ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో హాలిడే కార్నివాల్‌ సందడి గురువారం నాడు ప్రారంభమైంది. జూన్‌ 9 వరకు ఈ అపూర్వ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్నివాల్​ను ఎంజాయ్ చేయడానికి ఫిల్మ్​సిటీ, ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఓసారి సందర్శించండి. ఎన్నో అద్భుతాలను, అందమైన జ్ఞాపకాలను మీ జీవితంలోకి ఆహ్వానించండి..

ramoji_film_city_holiday_carnival
ramoji_film_city_holiday_carnival
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 11:48 AM IST

Ramoji Film City Holiday Carnival : వేసవి సెలవులు రానే వచ్చాయి. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో వినోదాల వేడుకలను తెచ్చాయి. సెలవు రోజుల్లో ప్రకృతి రమణీయ అందాల నడుమ ఫిల్మ్‌సిటీలో సరదా సరదాగా గడిపేందుకు తరలివచ్చిన పర్యాటకులతో కోలాహలం గురువారం ప్రారంభమైంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఫిల్మ్‌సిటీకి తరలివచ్చిన పర్యాటకులు వినోదాలను ఆస్వాదిస్తూ ఆనందతీరాలను చవిచూస్తున్నారు.

Summer Specia
కార్నివాల్‌ సందడి

Ramoji Film City Summer Special Holiday Carnival 2024 : సంభ్రమాశ్చర్యానికి గురిచేసేలా తొలిసారి వర్చువల్‌ షూట్‌ అనుభూతిని సందర్శకులకు అందుబాటులో ఉంచడంతో ఆబాలగోపాలం ఆ అనుభూతిని ప్రత్యక్షంగా వీక్షించి ఆనందిస్తున్నారు. ఉదయం 9:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు రోజంతా మైమరపించే ఫిల్మ్‌సిటీ అందాల మధ్య ఆనందడోలికల్లో తేలియాడుతూ వినోదం, విహారం కలగలిసిన హాలిడే కార్నివాల్‌లో పర్యాటకులు ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు.

ప్రత్యేకతలెన్నో : రామోజీ ఫిల్మ్‌సిటీలో హాలిడే కార్నివాల్‌లో ప్రత్యేకతలెన్నో సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. సినీ ప్రేక్షకుల మదినిదోచే ఆధునిక సాంకేతికత, మోషన్‌ క్యాప్చర్‌, వర్చువల్‌ షూట్‌ను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఫిల్మ్‌సిటీలోని వర్చువల్‌ ప్రొడక్షన్‌ సెట్‌లోకి అడుగుపెట్టి ఆ క్షణాలను ప్రతి ఒక్కరూ మధుర జ్ఞాపకాలుగా మలుచుకుంటున్నారు. అంతేకాదండోయ్‌ రెయిన్‌ డ్యాన్స్‌ ఫ్లోర్‌పై వేసవితాపం దరిచేరకుండా జల్లుల్లో తడిసిముద్దవుతూ పర్యాటకులు ఆనందతీరాలను చేరుతున్నారు.

Carnival 2024 RFC
వినోదం, విహారం

ఉత్సాహం, హుషారును నింపే సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్‌ చేస్తూ సరికొత్త సంతోషాల్లో మునిగితేలుతున్నారు. యురేకా వేదికపై కళాకారుల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఫిల్మ్‌సిటీలో మునుపెన్నడూ చూడని మ్యాజికల్‌ గ్లో గార్డెన్‌ అందాలను కళ్లారా వీక్షిస్తూ కలల లోకంలోకి వచ్చిన అనుభూతిని పొందుతున్నారు. మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపకాంతుల్లో మెరిసే గార్డెన్‌లో శిల్పాలు, వివిధ జంతు ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. కనువిందుగా సాగే కార్నివాల్‌ పరేడ్‌లో డీజే బీట్లకు ఆడుతూ ఆనందంలో తేలియాడుతున్నారు.

Carnival
రామోజీ ఫిల్మ్‌సిటీలో వినోదాల వేడుకలు

ప్రత్యేక ప్యాకేజీలు : ఈ హాలిడే కార్నివాల్‌లో పాలుపంచుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఉదయం 9:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు వివిధ ప్యాకేజీలు ఉన్నాయి. ఉదయం 9:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు వేడుకలను ఆస్వాదించేందుకు వచ్చే సందర్శకులు స్టూడియో టూర్‌ను నాన్‌ ఏసీ బస్సులో తిరిగి వీక్షించవచ్చు. ప్రీమియం ప్యాకేజీని ఎంచుకొనే పర్యాటకులకు ఏసీ బస్సులో స్టూడియో టూర్‌, ప్రత్యేక షోలకు ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ అవకాశం, బఫెట్‌ లంచ్‌ అందిస్తారు.

Ramoji Film City
రామోజీ ఫిల్మ్‌సిటీ

మరో ప్యాకేజీలో స్టూడియో టూర్‌తో పాటు పరిమితమైన కాంబో డిన్నర్‌ ఉంటుంది. మధ్యాహ్నం 2:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు ప్యాకేజీని ఎంచుకుంటే స్టూడియో టూర్‌, పరిమితమైన కాంబో డిన్నర్‌ అందిస్తారు. ప్రీమియం ఈవినింగ్‌ ప్యాకేజీని ఎంచుకొనే వారికి ఏసీ బస్సులో స్టూడియో టూర్‌, ప్రత్యేక షోలకు ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ అవకాశంతో పాటు బఫే డిన్నర్‌ అందిస్తారు. చిన్నారులకు స్పెషల్‌ సమ్మర్‌ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు www.ramojifilmcity.com కు లాగిన్‌ అవ్వండి. లేదా 76598 76598 నంబర్‌కు ఫోన్‌ చేయండి.

Festival Celebrations at Ramoji Film City : రామోజీ ఫిల్మ్‌సిటీలో దసరా, దీపావళి పండుగ సంబురాలు.. ఇక సందడే సందడి

FTCCI Excellence Awards 2023 : 'రామోజీ ఫిల్మ్‌సిటీ'కి ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్‌ టూరిజం అవార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.