ETV Bharat / state

మీ ఇంట్లో దొంగలు పడతారనే భయమా? - ఈ యాప్​ శ్రీరామ రక్ష! - LHMS Police App

చోరీలకు అడ్డుకట్టవేసేందుకు పోలీసుశాఖ లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(LHMS)ను ప్రారంభించింది.

State Police Implemented LHMS APP for Curb Theft
State Police Implemented LHMS APP for Curb Theft (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2024, 1:22 PM IST

State Police Implemented LHMS APP for Curb Theft : దొంగతనాలను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసుశాఖ 2017లో ఎంతో ప్రతిష్టాత్మకంగా లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(LHMS)ను ప్రారంభించ. సాంకేతికతతో నేరాలు అదుపు చేసేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతోంది. కానీ ప్రజల్లో అవగాహన లేకపోవడంతో ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటివరకూ తక్కువ మంది యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవుల నేపథ్యంలో ఎల్‌హెచ్‌ఎంఎస్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పోలీస్‌ శాఖ సూచిస్తోంది. ఇటీవల కాలంలో ఇంటి దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో దీనిని వినియోగించుకోవడం ద్వారా చోరీలను అదుపుచేయవచ్చని పోలీసులు చెబుతున్నారు.

వినియోగం ఇలా : గూగుల్‌ స్టోర్‌ నుంచి ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ఏపీ పోలీస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఫోన్‌ నంబరు, చిరునామాతో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ పూర్తవగానే వచ్చే ఐడీ భద్రపరుచుకోవాలి. ఊరు వెళ్లాల్సిన సందర్భంలో యాప్‌లోకి వెళ్లి యూజర్‌ ఐడీ నమోదు చేసి వెళ్లే, తిరిగి వచ్చే సమయాలను టైప్‌ చేసి రిక్వెస్ట్‌ పోలీసు వాచ్‌ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. సమాచారం అందుకున్న కంట్రోల్‌ రూం పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో వచ్చిన చిరునామాలో వైఫై రూటర్‌, సెన్సార్‌తో పనిచేసే మోషన్‌ కెమెరాలు, విద్యుత్తు పోయినా పనిచేసేలా యూపీఎస్‌ ఏర్పాటుచేసి, కంట్రోల్‌ రూమ్‌కి అనుసంధానిస్తారు.

ఇంకా బర్త్ సర్టిఫికెట్ తీసుకోలేదా? - అయితే ఇలా అప్లై చేసుకోండి! - how to get BIRTH CERTIFICATE

నిమిషాల వ్యవధిలో పోలీసులు : తాళం వేసి ఉన్న ఇంట్లోకి అపరిచితులు ప్రవేశించడానికి ప్రయత్నిస్తే సెన్సార్‌ ద్వారా ఫోటోలు తీయడంతోపాటు అలారం ద్వారా కంట్రోల్‌ రూం, స్థానిక పోలీసులను అప్రమత్తం చేస్తుంది. నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడకు చేరుకుని దొంగలను పట్టుకునే అవకాశం ఉంది. ఎల్‌హెచ్‌ఎంస్‌ సేవలు కావాల్సిన వారు పోలీసు కంట్రోల్‌ రూమ్‌ నంబర్ 112కు ఫోన్‌ చేసి ఉచిత సేవలు పొందవచ్చన్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్‌పై ప్రజలకు పోలీసు యంత్రాంగం అవగాహన కల్పిస్తున్నారు.

"ఇంటికి తాళాలు వేసి బయట ఊర్లకు వెళ్లే వారంతా ఎల్‌హెచ్‌ఎంఎస్‌ సేవలను ఉపయోగించుకోవాలి. తద్వారా చోరీలకు పాల్పడే నిందితులను గుర్తించవచ్చు. నేరాల నియంత్రణలో సాంకేతికత అవసరాన్ని ప్రజలు గుర్తించి వినియోగించుకోవాలి. దొంగతనాలు జరిగినా నిందితులను వెంటనే అరెస్ట్‌ చేస్తారనే భరోసా ప్రజలు కలిగి ఉండాలి. నేరాలకు పాల్పడితే దొరికిపోతామని భయం నిందితుల్లో ఉండాలి." - విక్రాంత్‌ పాటిల్‌, కాకినాడ జిల్లా ఎస్పీ

ఆ రూట్లలో వెళ్లేవారికి 'హ్యాపీ జర్నీ' - 644 'దసరా స్పెషల్'​ ట్రైన్స్ - railway stations rush

హైదరాబాద్​లో అమానుషం - ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకుల అత్యాచారం - Two Girls Raped in Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.