SSC Exam Fee Date Notification in AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఇక పరీక్షల ప్రక్రియ మొదలైనట్లు అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 28 నుంచి నవంబరు 11లోపు ఫీజు చెల్లించాలని డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. ఆలోపు కట్టలేని వారు ఆలస్య రుసుముతో చెల్లించేలా వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు.
12వ తేదీ నుంచి నవంబరు 18 వరకు చెల్లిస్తే రూ.50, 19 నుంచి 25 వరకు రూ.200, 26 నుంచి నవంబరు 30 వరకు రూ.500 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఆన్‌లైన్ ద్వారా ఎగ్జామ్ ఫీజు చెల్లించాలని, పాఠశాల లాగిన్ ద్వారా హెడ్మాష్టార్లూ చెల్లించవచ్చని సూచించారు. రెగ్యులర్ విద్యార్థులు 125 రూపాయలు, సప్లిమెంటరీ రాసే విద్యార్థులు మూడు సబ్జెక్టుల వరకు 110 రూపాయలు, అంతకంటే ఎక్కువ ఉంటే 125 రూపాయలు, వృత్తి విద్యా విద్యార్థులు అదనంగా 60 రూపాయలు చెల్లించాలని తెలిపారు. వయసు తక్కువగా ఉండి పరీక్షలకు హాజరయ్యే వారు 300 రూపాయలు, మైగ్రేషన్ సర్టిఫికెట్ కావలసిన వారు 80 రూపాయలు చెల్లించాలని సూచించారు.
ఇక పరీక్షల ఫీజు కట్టే తేదీలు వచ్చాయి కాబట్టి విద్యార్థులు చదువుపై ఫోకస్ పెట్టాలని ఉపాధ్యాయులంటున్నారు. ప్రణాళిక ప్రకారం చదివితే మంచి మార్కులు సాధించవచ్చని సూచిస్తున్నారు. విద్యార్థులు ఆల్ ది బెస్ట్.
పిల్లలు చదువుకునే రూమ్ ఎలా ఉండాలో పలువురు వాస్తు నిపుణులు సూచనలు :
- పిల్లలు ఏకాగ్రతగా చదవడానికి వారికి ఒక స్టడీ రూమ్ వంటిది ఏర్పాటు చేయాలి. ఇది కచ్చితంగా తూర్పు లేదా పడమర దిశలో ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
- స్టడీ రూమ్ తూర్పు దిక్కులో ఉంటే ఇంకా మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారు చదువుపై దృష్టి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని అంటున్నారు.
- అలాగే స్టడీ రూమ్‌లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను చేయాలంటున్నారు.
- అలాగే పిల్లలు చదువుకునే రూమ్ గోడలు ఆకుపచ్చ, నీలం, పసుపు, తెలుపురంగుల్లో ఉంటే మంచిది. ఎందుకంటే.. ఈ రంగులు పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతాయి.
- పిల్లల స్టడీ టేబుల్ దీర్ఘ చతురస్రాకారంలో సౌకర్యంగా ఉండేలా ఉంటే వాస్తు ప్రకారం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
- అదేవిధంగా పిల్లల స్టడీరూమ్‌లో వాళ్లకు ఇష్టమైన రోల్‌మోడల్స్, మ్యాప్స్, గడియారం వంటివి ఏర్పాటు చేయాలి. ఇవన్నీ వారిలో ఏకాగ్రతను నింపుతాయంటున్నారు.
- ఇంకా పిల్లలు చదువుకునే రూమ్‌కు దగ్గరగా టీవీ, మ్యూజిక్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేయకూడదని నిపుణులంటున్నారు. దీనివల్ల వారి ఏకాగ్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
- ఇంట్లో చిన్న కుండీలో మనీప్లాంట్ వంటి మొక్కల్ని పెంచాలి. ఇవి వారిలో ప్రశాంతమైన ఆలోచనలు కలగడానికి సహాయం చేస్తాయని చెబుతున్నారు.
- పిల్లలు చదువుకునే గదిలో అద్దం వంటివి ఉంచకూడదని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇవి ఉండటం వల్ల వారు తరచూ అద్దంలో చూసుకుంటూ ఉండటంతో ఏకాగ్రతను కోల్పోయే అవకాశం ఉంటుందంటున్నారు.
- ఇంకా వారి స్టడీ రూమ్ పక్కన మెట్ల వంటివి ఉండకుండా చూసుకోవాలంటున్నారు. దీనివల్ల ఇతరులు నడుస్తున్నప్పుడు వచ్చే శబ్దాల వల్ల పిల్లలు చదువుపై ఏకాగ్రత పెట్టలేరని అంటున్నారు.
- ఇక చివరగా పిల్లలను పదేపదే చదవమని ఒత్తిడి పెంచకూడదంట. వారు చదువుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పించి ప్రోత్సహించాలని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.
సీబీఎస్ఈ రగడ - ఎక్స్ వేదికగా నారా లోకేశ్ Vs వైఎస్ జగన్
డిగ్రీ అర్హతతో - ఇండియన్ నేవీలో 250 ఆఫీసర్ పోస్టులు - దరఖాస్తుకు మరో 6 రోజులే ఛాన్స్!