Srivari Arjitaseva Tickets Quota Release on This Moth 19th : భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2025 జనవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను ఈనెలలో అందుబాటులోకి తేనుంది. ఆర్జిత సేవల కోటాను 19న విడుదల చేయనుంది. వీటిలో కొన్నింటిని ఎలక్ట్రానిక్ లక్కీడిప్ కోటా కింద ఈనెల 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సదుపాయం కల్పించింది.
- 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవా, ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను అందుబాటులో తేనున్నారు.
- ఈనెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు.
- ఈ నెల 24న ఉదయం 10 గంటలకు జనవరికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల బుకింగ్ కోటాను అందుబాటులో తెస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.
తిరుమల శ్రీవారి రథోత్సవం- కళ్లారా చూస్తే జన్మాంతర పాపాల నుంచి విముక్తి!
ఏడుకొండల్లో కొలువైన ఆ వేంకటేశ్వరుడిని ఏటా దర్శించుకోవాలనుకునే భక్తులెందరో. అలా వచ్చే భక్తులు శ్రీవారిని కళ్లారా చూడటానికి ఎన్నోరకాల ఆర్జిత సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒక్క క్షణం చూసినా చాలని తపించే ఆ వెంకన్న దర్శనాన్ని ఒక రోజంతా కల్పిస్తోంది ఓ ప్రత్యేకమైన సేవ. అదే శ్రీవారి ఉదయాస్తమానసేవ. కోటిరూపాయలకు పైగా విలువ చేసే ఈ సేవను దక్కించుకుంటే జన్మధన్యమైనట్టే! జీవితాంతం ఏడాదికోసారి స్వామిని తనివితీరా కొలవచ్చు.
తిరుపతికి వెళ్లాలనే ఆలోచన రాగానే వెంటనే టీటీడీ వెబ్‌సైట్‌కి వెళ్లి ప్రత్యేక దర్శనానికి టికెట్లు ఉన్నాయో లేవో చూసుకుంటాం. సర్వదర్శనం, దివ్య దర్శనాలతోపాటు నిత్య, వార పూజలూ, ప్రత్యేక సేవలూ చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటిలో ఎంతో విశేషమైనది ఉదయాస్తమాన సేవ.
స్వర్ణరథం, గజ వాహనాలపై విహరించిన శ్రీనివాసుడు - గోవింద నామస్మరణతో మారుమోగిన తిరుగిరులు