ETV Bharat / state

క్రీడారంగానికి పూర్వ వైభవం తీసుకువస్తాము: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ - Sportspersons met Pawan Kalyan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 7:29 PM IST

Sportspersons met Deputy CM Pawan Kalyan: దారి తప్పిన క్రీడారంగ వ్యవస్థను ప్రక్షాళన చేయ్యాలని డిప్యూటీ సీఎం పవన్‌ను క్రీడాకారులు కోరారు. కొంతమంది క్రీడాకారులు పవన్‌ను కలసి ఈ మేరకు విన్నవించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా క్రీడా రంగంలో అనుభవం ఉన్నవారికే ఉన్నత పదవి బాధ్యతలు అప్పగించాలని కోరారు. సానుకూలంగా స్పందించి పవన్‌ క్రీడారంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని భరోసా ఇచ్చారు.

sportspersons_met_pawan_kalyan
sportspersons_met_pawan_kalyan (ETV Bharat)

Sportspersons met Deputy CM Pawan Kalyan: వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని రంగాలూ అధోగతి పాలయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. క్రీడారంగం సైతం అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో దారి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధృడ సంకల్పంతో వడివడిగా అడుగులు వేస్తున్నాయని క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మేధావులు, ప్రముఖులు, వాణిజ్యవేత్తలు, క్రీడాకారులు పవన్ కల్యాణ్​ని కలిశారు. ఆంధ్ర , తెలంగాణ, పంజాబ్, దిల్లీకి చెందిన క్రీడాకారులు ఈ మధ్య కాలంలో పవన్​ను కలిశారు.

ఇలా కలసినవారిలో ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి కూడా ఉన్నారని క్రీడాసంఘాలు తెలిపాయి. క్రీడా సంఘాలు బాగుపడితేనే అత్యుత్తమ క్రీడాకారులు రూపొందుతారని దానికి సరైన మార్గదర్శనం చేసేవారు అవసరమని వారు పవన్ కల్యాణ్​కి విన్నవించారు. క్రీడలతో సంబంధంలేని వారికి క్రీడా సంఘాలను అప్పగించవద్దని విన్నవించారు. క్రికెట్​లో అనుభవం ఉన్నవారికే క్రికెట్ సంఘం భాద్యతలు అప్పగించాలని, అలాగే కబడ్డీ ఆటపై పట్టు ఉన్నవారికే కబడ్డీ సంఘాన్ని అప్పగించాలని, ఇదే పద్దతి అన్ని సంఘాలలో అమలు చేస్తే క్రీడా రంగంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని సూచించారు. కొన్ని క్రీడా సంఘాలు రాజకీయ ఉపాధి ఆవాస కేంద్రాలుగా మారిపోవడం వల్ల క్రీడాకారులకు ఇచ్చే సర్టిఫికేట్లు అంగడి సరుకుగా మారిపోయాయని పవన్ తెలిపారు.

అరకు కాఫీపై మోదీ మరోసారి ప్రశంసలు- మరోసారి కలిసి రుచి చూద్దామన్న చంద్రబాబు - PM Modi About Araku Coffee.

క్రీడా సంఘాలలో తిష్టవేసిన రాజకీయ నాయకులు క్రీడాకారుల ఎంపికలో తమ బందువులు, సన్నిహితుల పిల్లలను వారి అధికార దర్పంతో ఎంపిక చేయిస్తున్నారనీ ఫలితంగా పోటీలలో వారు నిలబడలేకపోతున్నారని తమ బాధను క్రీడా సంఘాల నేతలు వెలిబుచ్చారు. క్రీడా సంఘాల నిధులు యధేచ్చగా దోపిడీకి గురవుతున్నాయని, క్రీడా సంఘాలలో క్రీడానుభవం లేని రాజకీయనాయకులకు ప్రవేశం లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం క్రీడా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, క్రీడలకు వైభవాన్ని తప్పకుండా తీసుకు వస్తామని క్రీడాకారులకు పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.

చల్లా శ్రీనివాసులు శెట్టికి పవన్‌ కల్యాణ్‌ అభినందనలు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్​గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బోర్డు సిఫార్సు చేయడం తెలుగువారందరికీ గర్వ కారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీనివాసులు శెట్టికి పవన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆయన నేతృత్వంలో ఎస్​బీఐ మరెన్నో మైలురాళ్లను చేరుకోవాలని ఆకాంక్షించారు. క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు కూలీలు, చిరు వ్యాపారుల సాదకబాధకాలు తెలిసిన శ్రీనివాసులు శెట్టి ఆయా వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకొనేలా బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరింపచేయాలని కోరారు.

కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకున్న పవన్ - అడుగడుగునా అభిమానుల ఘన స్వాగతం - Pawan Kalyan to visit Kondagattu

జల్​జీవన్ మిషన్ గ్రాంట్ వివరాలివ్వండి - అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం - Pawan Kalyan Review

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.