Young Woman Commits Suicide due to Man Harassment: అమ్మ, నాన్న, ఆమె, తమ్ముడు ఇదే తన కుటుంబం. వారితోనే తన జీవితం అనుకుంది. తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమ. అందులోనూ తోడబుట్టిన తమ్ముడంటే తన ప్రాణం కంటే ఎక్కువ. అక్కకు తమ్ముడు తోడుగా తమ్ముడికి అక్క తోడుగా ఉంటూ ఇంట్లో ఆ అల్లరే వేరు. అలాగని ఆ అల్లరితనం ఆమెలో లేదు. చదువులో అత్యుత్తమంగా రాణించింది. ఇలా రాణించి జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాలని ఎప్పుడూ కలగనేది. ఆ కలను నిజం చేసుకోవడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉండేది. ఒక మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులు, తమ్ముడికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలనుకుంది.
కానీ ఇంతలోనే ఓ ఆకతాయి వేధింపులు ఆమె పాలిట యమపాశమయ్యాయి. ఆమె కలలు కల్లలు చేశాయి. ఆ ఇంటి దీపాన్ని ఆర్పేశాయి. ప్రేమిస్తున్నానంటూ ఆ ఆకతాయి చేసిన వేధింపులు తాళలేక ఆమె బలవన్మరణానికి ప్రయత్నించింది. కానీ ఆసుపత్రిలో కొన ఊపిరితో తన తమ్ముడికి రాఖీ కట్టాలనుకుంది. సోమవారం రోజున రక్షా బంధన్ వస్తున్నందున, అప్పటి దాక తాను బతికుంటానో లేదోనని, చివరిసారిగా రాఖీ కడతానని తల్లిదండ్రులకు చెప్పింది. అలా ఆ యువతి తన తమ్ముడికి, పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే కనుమూసింది. ఈ విషాద సంఘటన అక్కడున్న వారందరితో కన్నీళ్లు పెట్టించింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్తున్న మైనర్‌పై గ్యాంగ్‌రేప్
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామంలో ఆ చిన్న కుటుంబం నివాసం ఉంటుంది. వారిలో పెద్ద కుమార్తె (17) కోదాడలో పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఆమె రోజు కాలేజీకి కోదాడకు వెళుతూ ఉండేది. ఖమ్మం పట్టణానికి చెందిన ఓ ఆకతాయి ప్రేమ పేరిట తరచూ ఆ యువతిని వేధిస్తూ ఉండేవాడు. ఆమె వద్దన్నా వేధించేవాడు. ఈ క్రమంలో ఆమె మనస్తాపం చెంది గత గురువారం గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అది గమనించి కుటుంబీకులు మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
అక్కడ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో యువతి పరిస్థితి విషమించింది. ప్రతి రక్షాబంధన్‌కు ఆమె తన తమ్ముళ్లుకు రాఖీ కడుతూ ఉండేది. ఇప్పుడు కూడా సోమవారం రక్షాబంధన్ కావడంతో అప్పటివరకు బతికి ఉంటానో లేదో అని భావించి శనివారం రాత్రి తన తమ్ముడితో పాటు పెద్దనాన్న కుమారుడికి రాఖీ కట్టింది. ఈ సన్నివేశం అక్కడుకున్న వారితో కన్నీళ్లు పెట్టించింది. రాఖీ కట్టిన కొద్ది గంటల్లోనే ఆదివారం తెల్లవారుజామున మూడుగంటల సమయంలో ఆమె కన్నుమూసింది.
వేధించిన ఆకతాయిపై కేసు నమోదు : ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఆకతాయిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు నర్సింహులపేట పోలీసులు తెలిపారు. ఆకతాయి కోసం గాలింపు చేపట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో రాఖీపౌర్ణమి శోభ - దుకాణాల వద్ద మహిళామణుల సందడి - RAKHI POURNAMI IN TELUGU STATES