ETV Bharat / state

ఏబీవీకి మిగిలింది కొన్ని గంటలే - సీఎస్ మొండి పట్టు వీడతారా? లేక భీష్మించుకొని కూర్చుంటారా? - AB Venkateswara Rao Retire today - AB VENKATESWARA RAO RETIRE TODAY

Senior IPS Officer AB Venkateswara Rao Will Retire Today: గౌరవప్రదంగా ఉద్యోగ విరమణ చేయడం ప్రతి ఉద్యోగి కల. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కక్షసాధింపులతో ఐదేళ్లుగా ఉద్యోగ బాధ్యతలకు దూరమైన సీనియర్‌ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు నేడు పదవి విరమణ చేయనున్నారు. ఈ రోజైనా ఆయన్ను విధుల్లోకి తీసుకుని పోస్టింగ్‌ ఇస్తారా ఐదేళ్లుగా అనుసరించిన కక్షసాధింపు ధోరణే కొనసాగిస్తారా అనేది కొద్ది గంటల్లో తేలనుంది. సస్పెన్షన్‌ ఎత్తివేతపై క్యాట్‌ ఆదేశాలను నిలుపుదల చేయడం కుదరదని హైకోర్టు ఉత్తర్వులిచ్చినా గురువారం రాత్రి వరకు ఏబీవీని సీఎస్ జవహర్‌రెడ్డి విధుల్లోకి తీసుకోకుండా ప్రభుత్వ పెద్దలకు స్వామిభక్తి చాటుకున్నారు.

Senior IPS Officer AB Venkateswara Rao Will Retire Today
Senior IPS Officer AB Venkateswara Rao Will Retire Today (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2024, 7:16 AM IST

ఏబీవీకి మిగిలింది కొన్ని గంటలే - సీఎస్ మెండి పట్టు వీడతారా లేక భీష్మించుకొని కూర్చుంటారా? (ETV Bharat)

Senior IPS Officer AB Venkateswara Rao Will Retire Today : డైరెక్టర్‌ జనరల్‌ ర్యాంక్‌ కలిగిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఐదేళ్లుగా ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకుండా, సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి, అక్రమ కేసులతో జగన్‌ ప్రభుత్వం, వైఎస్సార్సీపీ వీరభక్త అధికార గణం వేధించింది. సుదీర్ఘ సర్వీసులో చివరి రోజైనా ఆయన్ను విధుల్లోకి తీసుకుని పోస్టింగ్‌ ఇస్తుందా లేదా ఇప్పటి వరకూ ఆయన పట్ల అనుసరించిన కక్షసాధింపు ధోరణినే కొనసాగిస్తుందా అనేది నేడు తేలిపోనుంది.

జగన్‌ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏబీవీని విధుల్లోకి తీసుకోకుండానే పదవీవిరమణ చేయించాలనే దురుద్దేశమే కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏబీవీ సస్పెన్షన్‌ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ఈ నెల 8న ఆదేశాలిచ్చింది. 22 రోజులు గడిచినా ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు సరికదా! ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్‌ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులిచ్చింది. వాటిని ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్‌ జవహర్‌రెడ్డికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోనూ అందజేశారు. చట్టం, నిబంధనలు పాటించే, న్యాయవ్యవస్థ ఆదేశాల అమలుకు కట్టుబడి ఉండే ఏ అధికారైనా సరే వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకుని పోస్టింగ్‌ ఇవ్వాలి.

ప్రభుత్వం ఏబీవీకి పోస్టింగ్ ఇస్తుందా ? - ఇవ్వకుండానే సాగనంపుతుందా ! - IPS AB Venkateswara Rao

ఏబీవీపై అభియోగాలు మోపటమే తప్ప గత ఐదేళ్లలో ప్రభుత్వం అవేవీ నిరూపించలేకపోయింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన కేసు తేల్చనేలేదు. క్రిమినల్‌ కేసులోనూ అభియోగపత్రం దాఖలు చేయలేదు. ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుతో పాటు క్యాట్‌ కూడా ఆయనపై సస్పెన్షన్‌ ఎత్తేయాలని, విధుల్లోకి తీసుకోవాలనే ఆదేశాలిచ్చాయి. అయినా జగన్‌ సర్కారు వాటన్నింటినీ బేఖాతరు చేస్తూనే ఉంది. ఏబీవీ తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ అభియోగాలు నిరూపించట్లేదు. సస్పెన్షన్‌ ఎత్తేయాలని న్యాయస్థానాలు ఆదేశాలిచ్చినా అమలు చేయట్లేదు. పదవీవి రమణ చివరి రోజు వరకూ కూడా ఏబీవీని విధుల్లోకి తీసుకోకుండా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది.

క్యాట్‌ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉదయమే ఆదేశించినప్పటికీ రాత్రి వరకూ కూడా ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకుంటూ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులివ్వలేదు. శుక్రవారం ఏబీవీ పదవీ విరమణ చేయనున్నారు. అప్పటి వరకూ ఆయన్ను సస్పెన్షన్‌లో కొనసాగిస్తూ పోస్టింగ్‌ లేకుండానే సాగనంపాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందన్న చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారుల సీనియార్టీ జాబితాలో ఏబీ వెంకటేశ్వరరావు అగ్రస్థానంలో ఉన్నారు. అలాంటి సీనియర్‌ అధికారిని ప్రభుత్వమే ఇంతలా వెంటాడి, వేటాడి వేధించిన ఘటనలు దేశచరిత్రలోనే అరుదు. కానీ 34 ఏళ్ల పాటు పోలీసుశాఖకు సేవలందించిన ఏబీవీకి కేవలం కక్షసాధింపు కోసం జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లపాటు పోస్టింగు ఇవ్వలేదు. దాదాపు నాలుగున్నరేళ్లుగా సస్పెన్షన్‌లో ఉంచింది. డీజీ క్యాడర్‌ అధికారైన ఏబీవీకి జగన్‌ ప్రభుత్వం వల్ల జరిగిన నష్టం పూడ్చలేనిది. ఎవరైనా తమ కెరీర్‌ చివరిదశలో అత్యున్నత పోస్టుల్లో బాధ్యతలు నిర్వహిస్తారు. అలాంటి అవకాశం లేకుండా ఆయన పదవీవిరమణ వరకూ సస్పెన్షన్‌లో ఉంచటం ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు నిదర్శనం.

సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట - ప్రభుత్వ అప్పీల్​ కొట్టివేత - BIG RELIEF TO AB VENKATESWAR RAO

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జవహర్‌రెడ్డి ఏబీవీపై సస్పెన్షన్‌ ఎత్తేయాలంటూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను ఇప్పటి వరకూ అమలు చేయకపోవడం అనుమానాలను రేకేత్తిస్తోంది. క్యాట్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆఘమేఘాలపై హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌లో పిటిషన్‌ సీఎస్ అదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మాత్రం అమలు చేయడం లేదు. క్యాట్, హైకోర్టు ఉత్తర్వుల ప్రతుల్ని ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్​కు అందజేసి వాటిని అమలు చేయాలని కోరినా ఆయన్ను విధుల్లోకి తీసుకోకుండా కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడుతున్నారు. సీనియర్‌ అధికారిపై ప్రభుత్వ పెద్దలు కక్ష సాధిస్తుంటే ఆ చర్యలను అమలు చేస్తూ సీఎస్ స్వామిభక్తిని చాటుతున్నారు.

ఒక కాకికి ఆపదొస్తే చుట్టూ పది కాకులు చేరి సంఘీభావం తెలుపుతాయి. అలాంటిది ఎంతో గొప్పగా చెప్పుకొనే ఐపీఎస్‌ అధికారుల్లో ఆ సంఘీభావం కనిపించడం లేదు. తమ సహచర సీనియర్‌ అధికారి ఏబీవీపై ప్రభుత్వమే కక్ష కట్టి ఐదేళ్లుగా వేధిస్తుంటే ఆయనకు జరుగుతున్న అన్యాయంపై ఐపీఎస్‌ అధికారుల సంఘం నోరెత్తలేదు. ఆయన పదవీవిరమణ చేసే వరకు విధుల్లోకి తీసుకోకుండా కక్ష సాధిస్తుంటే దాన్ని ఖండించలేదు. వైకాపాతో అంటకాగుతూ ఎన్నికల్లో ఆ పార్టీకి లబ్ధి కలిగించేలా పనిచేసిన ఐపీఎస్‌ అధికారులపై పత్రికల్లో కథనాలు రాస్తే వారందరి తరఫున వకాల్తా పుచ్చుకుని ఐపీఎస్‌ అధికారుల సంఘం ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడి హోదాలో కాంతిరాణా తాతా వాటిని ఖండిస్తూ, మీడియాను విమర్శిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియాపైన రాజకీయ విమర్శలు చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. మరి ఏబీవీకి తీవ్ర అన్యాయం జరుగుతుంటే కాంతి రాణా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సామాన్య పౌరులు ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వాలంటూ గురువారం సాయంత్రం వరకు 44,222 మంది ఛేంజ్‌.ఓఆర్‌జీలో సంతకాలు చేసి రాష్ట్రపతికి, సీజేఐకి, ప్రధానమంత్రికి పంపించారు. సామాన్య పౌరులు చూపిన సంఘీభావం కూడా ఐపీఎస్‌ అధికారుల సంఘం చూపలేకపోయింది.

ప్రభుత్వమే పగబడితే ఎలా?!- ఐపీఎస్​ ఏబీ వెంకటేశ్వరరావుపై ఐదేళ్లుగా వేధింపులు - AB Venkateswara Rao Posting

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.