Sanjeev Kumar Commemts on YCP Government: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అధికార పార్టీ దాష్టికానికి చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం, పెత్తందారీ పాలనకు నిదర్శనమని కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ ధ్వజమెత్తారు. చట్టబద్ధ పాలనకు పాతరేసి, అరాచకం పెచ్చరిల్లుతుంటే మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో ప్రజలంతా ఆలోచించాలని ఆయన కోరారు. ఈ పాలకులను కొనసాగిస్తే ఎంత ప్రమాదమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబంలో మిగిలిన ఒక యువతిని సంజీవ్ పరామర్ళించారు. ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 30 లక్షలకు పైగా పద్మశాలిలు ఉన్నారని అన్నారు. సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రెవిన్యూ అధికారులు డబ్బుకు ఆశ పడి కట్టా శ్రావణి పేరు మీద ఉన్నట్లుగా రికార్డులు మార్చేశారని ఆయన పేర్కొన్నారు. సుబ్బారావు కుటుంబం కొంత కాలంగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఆన్లైన్లో రికార్డులు తారుమారు చేసి ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారని ఆయన ఆక్షేపించారు.
వైసీపీ భూ బకాసురులతో పోరాడలేక నిండు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది: చంద్రబాబు
2019లో పీఎం కిసాన్ యోజన పథకం కింద డబ్బులు పడినా రెవెన్యూ, పోలీస్ అధికారులు మృతుడి పెరు మీద భూమి లేదనడం విడ్డురంగా ఉందన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబంపై అధికారులు, పోలీసులు లేనిపోని నిందలు వేయడం హేయమైన చర్యగా భావిస్తున్నామన్నారు. అధికారులు అసలు ఏం జరిగిందో నిజం అందరికీ తెలిసేలా చెప్పాలన్నారు. అధికారులు ప్రభుత్వానికి బయపడి తప్పుడు రిపోర్టులు చెప్పడం సరి కాదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని పద్మశాలీలు ఏకతాటిగా రావాలని ఎంపీ సంజీవ్ కుమార్ పిలుపునిచ్చారు.
వైసీపీ వల్లే మా కుటుంబం ఆత్మహత్య అంటున్న కుమార్తె - అప్పుల బాధతోనే అంటున్న పోలీసులు
ఇటీవల బాధిత కుటుంబానికి అండగా ఉంటామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. లక్ష్మీప్రసన్న స్థిరపడటానికి, పెళ్లి చేసుకునే వరకు తాను బాధ్యతలు తీసుకుంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ మేరకు లక్ష్మీప్రసన్నతో చంద్రబాబు సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. సుబ్బారావు, భార్య పద్మావతి, చిన్న కుమార్తె వినయ మృతదేహాలకు జరిగిన దహన సంస్కారాల్లో పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సమయంలో చంద్రబాబు జగన్‌మోహన్‌రాజు సెల్‌ఫోన్‌కి ఫోన్ చేసి లక్ష్మీప్రసన్నతో మాట్లాడారు. తల్లిదండ్రులు, చెల్లెలు ఆత్మహత్యకు కారణలేమిటని ఆయన ఆరా తీశారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధ నుంచి తేరుకుని నిలబడాలన్నారు. తెలుగుదేశం నీకు అండగా వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. దహన సంస్కారాలకు టీడీపీ నేతలు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. చంద్రబాబు తనను పరామర్శించడం ధైర్యాన్ని ఇచ్చిందని సుబ్బారావు కుమార్తె లక్ష్మీప్రసన్న తెలిపారు.