ETV Bharat / state

బాపట్లలో ట్రాక్టర్​ బోల్తా - ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు - TRACTOR BOLTHA in bapatla

Road Accident in Bapatla District : బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కట్టెల లోడుతో వెళుతున్న ట్రాక్టర్​ బోల్తా పడి ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

road_accident
బాపట్లలో ట్రాక్టర్​ బోల్తా - ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 10:59 AM IST

Road Accident in Bapatla District : బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టెల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఒకరు మృతిచెందగా ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన కొరిశపాడు మండల సమీపంలో చోటుచేసుకుంది. చిలకలూరిపేట మండలం కొత్త రాజుపేట నుంచి కట్టెల లోడుతో ట్రాక్టర్ కొరిశపాడు వస్తున్న క్రమంలో ఎదురువాగులో అదుపు తప్పి పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్​తో పాటు ట్రాక్టర్​పై ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో సకాలంలో స్థానికులు వెంటనే స్పందించారు.

వైఎస్సార్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - ఎనిమిది మంది మృతి - Road Accidents at YSR District

అందుబాటులో ఉన్న ప్రొక్లైన్​ సహాయంతో ట్రాక్టర్​ను వెలికి తీశారు. కట్టెల కింద ఇరుక్కున్న ముగ్గురు వ్యక్తులను అతి కష్టం మీద క్షేమంగా బయటకు తీశారు. ఒక వ్యక్తి మాత్రం పక్కన ఉన్న కాలువలో కూరుకుపోవడం, కట్టెలు అతనిపై పడటంతో ఊపిరి ఆడక మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు 108 వాహనంలో ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును స్థానికులు అడిగి తెలుసుకున్నారు. మృతిచెందిన వ్యక్తి వి.నాగేశ్వరరావు(50)గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

రిసెప్షన్​కు వెళ్లి వస్తుండగా ప్రమాదం - ముగ్గురు మృతి - Road Accident in Tadipatri

రెండు బైక్​లను ఢీకొట్టిన లారీ- ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు - Two people died on road accident

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.