Residents Of Nellore City Living In Dumping Yard: బడిలో చదువుకుంటూ, చక్కగా అక్షరాలు దిద్దుకుని, తోటి స్నేహితులతో ఆటలాడుకోవలసిన వయసు. కాని దుర్గంధం వెదజల్లే డంప్పింగ్ యార్డులో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తిరుగుతూ, కుళ్లిన దుర్వాసనలు మధ్య సంచరిస్తూ, కాలువ నీటిలో తిరుగుతూ అనారోగ్య వాతావరణంలో పెరుగుతున్న చిన్నారుల పరిస్థితి ఇది. ఈ ప్రాంతంలో కొందరు నివసిస్తున్నారని, వారి సంక్షేమం గురించి ముఖ్యమంత్రిగా పట్టించుకోవలసిన బాధ్యత కాని ఉండదు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మాత్రమే గుర్తొస్తామని తమకు ఇంటి స్థలం ఇప్పించి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దితే చాలని నెల్లూరు జిల్లాలో డంపింగ్ యార్డ్‌లో నివసిస్తున్న గిరిజన ప్రాంతవాసులు కోరిక ఇది.
డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై గ్రామస్థుల ఆందోళన - సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే
Government Schemes are Not available: బడిలో అక్షరాలు దిద్దాలని, పుస్తకాలు,పెన్నులు కావాలని బాగా చదువుకోవాలని ముక్కుపచ్చలారని చిన్నారులకు ఉన్నా ఆదుకునే నాధుడేలేక చెత్తలోనే చిన్నారుల జీవితాలు బుగ్గిపాలు అవుతున్నాయి. వీరి పుట్టుక,పెరుగుదల అన్ని డంపింగ్ యార్డ్‌లోనే. ఇక్కడ నివసిస్తున్న కుటుంబాలు, ఏడాది వయస్సు కూడా నిండని పసిపిల్లలను చూస్తే ఎవరికైనా కన్నీరు తన్నుకు వస్తుంది. జగన్ ప్రభుత్వానికి మాత్రం ఐదేళ్లుగా వీరి దుస్థితిపై కనికరం కూడా కలగడం లేదు. మానవత్వానికి సహాయపడని పథకాలు ఎందుకు అనే విధంగా నెల్లూరు నగర ప్రజల దుస్థితి ఉంది.
రోడ్డు పక్కన ఉండే చెత్త పక్కనుంచి వెళ్లడానికే మనం ఇష్టపడం. అలాంటిది ఆ చెత్త కుప్పల మధ్యలోనే నివసిస్తూ జీవనం సాగిస్తున్న గిరిజన కుటుంబాలు జీవిత గాధ. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో చెత్తను పడేసే డంపింగ్ యార్డు అది. జిల్లాలోని దొంతాలి గ్రామం సమీపంలో ఉంటుంది. ఇక్కడ కొన్నేళ్లుగా 20 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ కుటుంబాల్లో సుమారు 30 మంది చిన్నారులు ఉన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని మాట్లాడున్న మన పాలకులు ఈ చిన్నారుల దయానీయమైన జీవితాన్ని మార్చలేకపోతున్నారు.
విజయవాడలో పడకేసిన పారిశుద్ధ్యం- మృత్యుపాశాలుగా మారుతున్న డ్రైనేజీలు
Childrens in Dumping Yard: తమ పిల్లల బాల్యం డంపింగ్ యార్డులో బుగ్గిపాలవుతుందని గిరిజన తల్లితండ్రులకు తెలుసు. ఉపాధి లేక ఆర్థిక పరిస్థితి కారణంగా ఇళ్లులేక దొంతాళి డంప్పింగ్ యార్డులోనే జీవిస్తున్నారు. మండే ఎండల్లోనూ చెట్లకిందే నిద్రపోతారు. కుక్కలు, పాములతో సహజీవనం చేస్తుంటామని వారు చెబుతున్నారు. రాత్రి చిమ్మ చీకటిలో బతుకుజీవనం అలవాటైందని, అర్హులమైనా ప్రభుత్వ పథకాల్లో ఏ ఒక్కటీ దరికి చేరవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు ఎవరూ రారని తమ గోడు పట్టించుకోవడం లేదని, ఎన్నికల సమయంలో వచ్చి ఓటు వేయమని చెప్పి వెళ్లిపోతారని గిరిజన మహిళలు వాపోతున్నారు. డంపింగ్ యార్డు నుంచి బయటకు తీసుకువచ్చి కొత్త జీవితం ఇవ్వాలని కోరుతున్నారు.
" మాతో పాటు మా పిల్లలు కూడా డంపింగ్ యార్డులో పెరుగుతున్నారు. నిత్యం జ్వరాలు, జలుబులతో నిత్యం అనారోగ్యంతో జీవిస్తున్నాం. చెత్తను తీసుకువచ్చే లారీల్లో తినడానికి ఏమైనా దొరుకుతాయని పిల్లలు వెతుకులాడుతున్నారు. ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించి, పిల్లలకు మంచి పాఠశాలలో చదువులు చెప్పించండి. " - స్థానిక మహిళ