ETV Bharat / state

రెయిన్​ అలర్ట్​- నాలుగు రోజుల పాటు కూల్​ వెదర్​ - Rain Alert in Andhra Pradesh - RAIN ALERT IN ANDHRA PRADESH

Rain Alert in Andhra Pradesh : ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. నంద్యాల జిల్లా ఆత్మకూరులో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉరుములు, మెరుపులతో గాలివాన కురుసింది. మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

rain_alert_in_andhra_pradesh
rain_alert_in_andhra_pradesh (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 11:26 AM IST

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు (etv bharat)

Rain Alert in Andhra Pradesh : ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. నంద్యాల జిల్లా ఆత్మకూరులో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉరుములు, మెరుపులతో గాలివాన కురుసింది. మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Weather Warnings of Andhra Pradesh for Next 4 Days : రాష్ట్ర వ్యాప్తంగా124 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణిపై వడగాల్పులు వీస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాగల రెండు మూడు రోజుల్లో చాలా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

తెలంగాణకు అలర్ట్ - మూడు రోజులు కూల్ హ్యాపీస్! - Telangana Rain Alert

Weather Changes in Nandyal District : ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీ రాములు నెల్లూరు, నంద్యాల, జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన-నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని స్పష్టం
Climate Updates : సోమవారం పల్నాడు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మంగళవారం గుంటూరు జిల్లాలో 11, అల్లూరి సీతారామరాజు 3, కాకినాడ 3, ఎన్టీఆర్ జిల్లాలోని 2 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. సోమవారం అత్యధికంగా నంద్యాల జిల్లా బనగానపల్లి, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 45.4, కర్నూలు జిల్లా పంచలింగాల, ప్రకాశం జిల్లా తర్లపాడులో 44.9, పల్నాడు జిల్లా రావిపాడులో 446, నెల్లూరు జిల్లా గోనుపల్లిలో 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఎడారి దేశంలో భారీ వర్షం- గంటలోనే ఏడాదిన్నర వాన- దుబాయ్​లో ఎటు చూసినా నీరే! - Heavy Rains In Dubai

ఈదురు గాలుల వర్షంలో - కారు ఎలా నడపాలో మీకు తెలుసా? - How To Drive car Strong Winds rains

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.