ETV Bharat / state

ఊగిసలాటల్లో బంగారం ధరలు- కొనుగోళ్లకు ఇది సరైన సమయమేనా? - PRATHIDHWANI ON GOLD

ఎప్పటికప్పుడు మారుతున్న బంగారం ధరలతో ప్రజల్లో అయోమయం - పసిడిధరలు అర్థం కావాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే.

prathidhwani-on-buy-gold-in-current-conditions-or-not
prathidhwani-on-buy-gold-in-current-conditions-or-not (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2024, 1:09 PM IST

Prathidhwani On Buy Gold In Current Conditions Or Not : మనదేశంలో బంగారానికి, ప్రజలకు మధ్య ఉన్న అనుబంధమే వేరు. ఎన్ని తరాలు గడిచినా దానిపై ఉన్న ప్రేమ తరగదు. పసిడికాంతులీనడం ఆగదు. సందర్భం ఏదైనా పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయిందీ లోహం. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం కూడా. అందుకే దాని ధరల్లో వచ్చే ప్రతిచిన్న చిన్నమార్పును ఎప్పటికప్పుడు తెలుసుకుంటారంతా. ఆ మార్పులకు కారణాలు రానున్న రోజుల్లో దాని ప్రభావాలు ఎలా ఉంటాయో అంచనాకు రావడం అవసరం. ఇప్పుడు కూడా తగ్గిన ధరల్లో బంగారం కొనాలా? ఆగాలా? రానున్న రోజుల్లో పసిడి ధరలు ఇంకా తగ్గుతాయా? పెరుగుతాయా? మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఏం చేస్తే మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో పాల్కొంటున్న వారు విశాఖ బులియన్ మార్కెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఏ శ్రీనివాసరావు. ఆర్సీపీ టెక్నాలజీస్, స్టాక్‌మార్కెట్‌ విశ్లేషకులు సుందర్‌ రామిరెడ్డి.

అంతా పండగల సీజనే : ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కొంతకాలంగా రికార్డు స్థాయి గరిష్ఠాల్లో ఉన్న బంగారం ధరల్లో ఇటీవల కొంత హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ బంగారం ధరలు చూస్తున్న తర్వాత ఇప్పుడు చాలామందిలో బంగారం ఇప్పుడు కొనాలా? ఆగాలా? బంగారం కొనుగోళ్లు, పెట్టుబడులకు ఇది అనువైన సమయమేనా అని తర్జనభర్జన పడుతున్నారని వెల్లడించారు. ఇప్పటి నుంచి మరికొన్ని నెలలు వరకూ అంతా పండగల సీజనే ఉంది. పండగల నుంచి పెళ్లిళ్లు, వేడుకల సందర్భాలకి ప్రతిఒక్కరు ఎంతోకొంత గోల్డ్ కొనాలి అనుకుంటారని వివరించారు. అసలు బంగారం ధరలను ఏఏ అంశాలు ప్రభావితం చేస్తాయో ప్రజలు తెలుసుకోవాలన్నారు.

చీకట్లు చీల్చుకుంటూ కొత్త ఉషోదయం ముంగిట అమరావతి - కూటమి ప్రభుత్వం రాకతో మారిన పరిస్థితులు - Amaravati Works

ఆ ఇంపాక్ట్ ఎంతకాలం ఉండొచ్చు : ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, బ్రిటన్, అమెరికా వంటి అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కుంటున్న సంక్షోభాలు ఇవన్నీ బంగారం మీద ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఆ ఇంపాక్ట్ ఎంతకాలం ఉండొచ్చొ ప్రజలు ఎప్పుటికప్పుడు తెలుసుకొని బంగారం కొనుగొలు చేయాలని సూచించారు.పెట్టుబడి పెట్టేముందు ఒక దశాబ్ద కాలం వెనుక నుంచి గణాంకాలు పరిశీలించి బంగారం, రియల్‌ ఎస్టేట్‌, స్టాక్ మార్కెట్ వీటిల్లో ఎక్కువ రిటర్న్స్‌ ఇచ్చినది ఏంటనేది పరిగణలోకి తీసుకోవాలన్నారు.

గంటలో గోల్డో లోన్ : బంగారం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వివరించారు. మన దగ్గర గోల్డ్ కనుక ఉంటే ఆర్థిక అవసరాలు పీకలమీదకి వచ్చినప్పుడు వాళ్లని వీళ్లని అప్పుడు అడిగి, వడ్డీలకు వడ్డీలు కట్టే బదులు బ్యాంకుకి వెళితే గంటలో గోల్డో లోన్ ఇస్తారని తెలిపారు. అదేవిధంగా ఓకేసారి కట్టాలనే నియమం లేదన్నారు. ప్రైవేటు రుణాలతో పోలిస్తే వడ్డీ తక్కువగా ఉంటుందని వక్తలు వివరించారు.

ప్రపంచాన్ని యుద్దాలు భయపెడుతున్నాయా? - భారత్​ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? - PRATIDWANI DEBATE ON WORLD WAR

వార్‌జోన్​లో అడుగు పెట్టిన మోదీ - ప్రపంచం చూపు ప్రధాని ఉక్రెయిన్ పర్యటన వైపు - Pratidhwani on Modi Tour to Ukraine

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.