ETV Bharat / state

కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ - ఆగని వైసీపీ నేతల ప్రలోభాలు - Postal Ballot Voting Andhra Pradesh - POSTAL BALLOT VOTING ANDHRA PRADESH

Postal Ballot Voting in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్​లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల వద్ద కూడా వైఎస్సార్సీపీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద వివాదం తలెత్తింది. పోలింగ్ కేంద్రం ఆవరణలో వైఎస్సార్సీపీ నేతలు ప్రచారం నిర్వహించారు. అదే విధంగా పలుచోట్ల పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

Postal Ballot Voting in Andhra Pradesh
Postal Ballot Voting in Andhra Pradesh (etv bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 2:10 PM IST

కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ - ఆగని వైసీపీ నేతల ప్రలోభాలు (etv bharat)

Postal Ballot Voting in Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ కొనసాగుతోంది. విజయవాడలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ వినియోగించుకునేందుకు కాస్త ఇబ్బంది పడ్డారు. ఓటు ఇక్కడ కాదంటూ అక్కడ, అక్కడ కాదంటూ ఇక్కడ అని తిప్పుతున్నారని ఉపాధ్యాయులు ఆరోపించారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడిన తర్వాత తమ ఓటు ఇక్కడ లేదని తెలిసి నిరాశగా వెనుతిరుగుతున్నారు.

వైఎస్సార్సీపీ నేతల ప్రచారం: తిరుపతి జిల్లా వెంకటగిరిలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. తెలుగుదేశం, వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎన్నికల కేంద్రానికి వచ్చి పోలింగ్ సరళిని పరిశీలించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద వివాదం తలెత్తింది. శ్రీకాళహస్తిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఆవరణలో వైఎస్సార్సీపీ నేతలు ప్రచారం నిర్వహించడంపై వాగ్వాదం జరిగింది. కూటమి అభ్యర్థి సుధీర్ రెడ్డి కూడా వైఎస్సార్సీపీ నాయకులకు పోటీగా ఉద్యోగులను ఓట్లు అభ్యర్థించారు. పోలీసులు ఇరువర్గాలను అక్కడనుంచి బయటకు పంపారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా జరుగుతుండటంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భారీగా వచ్చిన టీడీపీ, వైసీపీ నేతలు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్దకు తెలుగుదేశం, వైఎస్సార్సీపీ నేతలు భారీగా చేరుకున్నారు. ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇరుపార్టీలకు చెందిన నాయకులను చెదరగొట్టారు. ఇరువర్గాలను పోలింగ్ కేంద్రానికి దూరంగా పంపించారు. పులివెందులలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రశాంతగా సాగుతోంది. నేడు పీవో, ఏపీవోలు, ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బద్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉద్యోగులు ఉదయం నుంచి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ముందుగానే ప్రారంభమైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ - అయోమయంలో ఉద్యోగులు - Postal Ballot Voting

అనంతపురంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద వైసీపీ నేతలకు కుయుక్తులు పాల్పడ్డారు. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకునే ప్రాంతంలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ప్రవర్తిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహించకూడదన్న నిబంధనలో ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోవడం లేదు. ఇష్టానుసారంగా ఉద్యోగులను వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగుల ఫోన్ నెంబర్ ఇస్తే ఆన్లైన్ ద్వారా నగదు పంపిస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.

పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని అనంతపురం అర్బన్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఉద్యోగులను ప్రలోభ పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలపై అధికారులు చర్యలు తీసుకోకపోతే ఈసీకి ఫిర్యాదు చేస్తామని దగ్గుబాటి హెచ్చరించారు. ఓటు వేయడానికి వచ్చిన ఉద్యోగుల కోసం పోలింగ్ కేంద్రం వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడకూడదనే ఉద్దేశంతోనే వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు.

పోస్టల్ బ్యాలెట్‌ ఓటింగ్​లో గందరగోళం- ఓటు వేయకుండా కుట్రలు చేస్తున్నారన్న ఉద్యోగులు - Employees Postal Ballot Voting

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల వద్ద రెండవ రోజు కూడా గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఓటు హక్కు కోసం పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాకిడితో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. తాగునీరు లేక మహిళా ఉద్యోగులు విలవిలలాడారు. జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు.

ఏపీలో మొదలైన ఓటింగ్ - మంగళగిరి నియోజకవర్గంలో తొలి హోమ్​ ఓటింగ్ - home voting started in AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.