ETV Bharat / state

కుక్కల విద్యాసాగర్‌ రిమాండ్ రిపోర్ట్​లో కీలక అంశాలు - నిందితుల్లో పలువురు ఐపీఎస్‌లు - Kadambari Jethwani Case Updates - KADAMBARI JETHWANI CASE UPDATES

Kukkala Vidyasagar Remand Report : కాదంబరీ జెత్వానీ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కుక్కల విద్యాసాగర్‌ రిమాండ్‌ రిపోర్ట్​లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రిపోర్ట్​లో విద్యాసాగర్‌తో పాటు మరో ఐదుగురిని నిందితులుగా చేర్చారు. ఇందులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ముంబయి నటిని అక్రమంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్​లో పేర్కొన్నారు.

Kadambari Jethwani Case Updates
Kadambari Jethwani Case Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2024, 4:22 PM IST

Updated : Sep 23, 2024, 5:18 PM IST

Kadambari Jethwani Case Updates : ముంబయి సినీనటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్​ను దెహ్రాదూన్‌ నుంచి రైలులో అర్ధరాత్రి తీసుకొచ్చిన పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షల అనంతరం ఇవాళ తెల్లవారుజామున న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలోనే పోలీసులు రిమాండ్ రిపోర్ట్​ను కోర్టుకు సమర్పించారు. ఆ రిపోర్ట్​లో సీనియర్ ఐపీఎస్ అధికారులు పి.సీతారామాంజనేయులు (పీఎస్‌ఆర్‌), కాంతిరాణా తాతా, విశాల్​గున్నీని నిందితులుగా చేర్చారు.

విద్యాసాగర్‌తో అధికారులు కుమ్మక్కయ్యారు : ఈ కేసులో ఏ1గా విద్యాసాగర్, ఏ2గా పి.సీతారామాంజనేయులు (పీఎస్‌ఆర్‌), ఏ3గా కాంతిరాణా, ఏ4గా వెస్ట్‌జోన్‌ పూర్వ ఏసీపీ హనుమంతురావు, ఏ5గా ఇబ్రహీంపట్నం పూర్వ సీఐ సత్యనారాయణ, ఏ6గా విశాల్‌గున్నీ పేర్లను పోలీసులు చేర్చారు. విద్యాసాగర్‌తో అధికారులు కుమ్మక్కైనట్లు రిమాండ్‌ రిపోర్ట్​లో వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ఐదుగురిని సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Mumbai Actress Case Updates : పి.సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్‌గున్నీ వైస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో కుమ్మక్కై కాదంబరీ జెత్వానీని అక్రమంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్​లో పేర్కొన్నారు. మరోవైపు కుక్కల విద్యాసాగర్​కు వచ్చే నెల 4 వరకు జడ్జి రిమాండ్‌ విధించగా విజయవాడ సబ్‌ జైలుకు తరలించారు. అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులోని మిగతా నిందితులకూ అరెస్ట్ భయం వెంటాడుతోంది.

ఈక్రమంలోనే ఈ కేసులో పలు నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్న నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కాంతిరాణా తాతా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మంగళవారం వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది. అయితే దర్యాప్తునకు కాంతిరాణా సహరించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.

జెత్వానీ ఐఫోన్లలో ఆధారాలు చెరిపేందుకు విఫలయత్నం - వెలుగులోకి పీఎస్​ఆర్​ అరాచకాలు - Kadambari Jethwani Case Updates

'అచ్చుతప్పులు, అభూత కల్పనలు'- సినీ నటి కేసులో కీలక సూత్రధారులపై విచారణ - Kandambari Jethwani case

Last Updated : Sep 23, 2024, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.