ETV Bharat / state

కేటీఆర్​ బంధువు ఫామ్​హౌస్​లో కలకలం - డ్రగ్స్ పరీక్షల్లో ఒకరికి పాజిటివ్

జన్వాడలో ఫామ్‌హౌస్‌పై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడులు

Police Raids in Janwada Farmhouse
Police Raids in Janwada Farmhouse (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2024, 12:22 PM IST

Updated : Oct 27, 2024, 2:26 PM IST

Janwada Farmhouse Party Case : హైదరాబాద్​ జన్వాడలోని ఫామ్​హౌస్​పై సైబరాబాద్​ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడ రిజర్వ్​ కాలనీలో ఉన్న రాజ్ ​పాకాల ఫామ్​హౌస్​లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లుగా వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో పాల్గొన్న 24 మందికి డ్రగ్స్​ పరీక్షలు నిర్వహించారు. అందులో విజయ్​ మద్దూరి అనే వ్యక్తి కొకైన్​ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో ఎన్​డీపీఎస్​ యాక్ట్​ కింద కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలోనే తనిఖీల్లో విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఎక్సైజ్​ యాక్ట్​ సెక్షన్ 34 కింద మరో కేసును నమోదు చేశారు. మద్యం పార్టీలో మొత్తం 35 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. పాల్గొన్న వారిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్​హౌజ్​ యజమాని రాజ్​ పాకాలను కేటీఆర్​ బావమరిదిగా నిర్ధారించారు. ఎక్సైజ్​ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా మద్యం పార్టీ చేశారని గుర్తించారు. క్యాసినో పరికరాలు సైతం స్వాధీనం చేసుకోవడంతో క్యాసినో నిర్వహించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్​హౌస్​లో ప్లేయింగ్​ కార్డ్స్​, ప్లాస్టిక్​ కైన్స్​ వంటివి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 30 ఎకరాల్లో రాజ్​ పాకాల ఫామ్​హౌస్​ విస్తరించి ఉంది.

Raj Pakala Farmhouse Case Updates : మరోవైపు జన్వాడ ఫామ్​హౌస్‌లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. పంచనామా తర్వాత మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు మరోసారి చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులు పంచనామా చేశారు. జన్వాడ ఫామ్​హౌస్ పార్టీ కేసులో విచారణ చేస్తున్నామని ఎక్సైజ్‌ సీఐ శ్రీలత తెలియజేశారు. ఏ1గా ఫామ్‌హౌస్‌ సూపర్‌వైజర్ కార్తీక్‌, ఏ2గా రాజ్‌ పాకాలను చేర్చామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి పార్టీ నిర్వహించారని పేర్కొన్నారు. కర్ణాటక లిక్కర్‌తో పాటు విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఏడు లీటర్ల విదేశీ మద్యాన్ని సీజ్‌ చేశామన్నారు. రాజ్ పాకాల పరారీలో ఉన్నారని తెలిపారు. విచారణలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఎక్సైజ్‌ సీఐ శ్రీలత వెల్లడించారు.

డ్రగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్​గా హైదరాబాద్​లోని పబ్స్​ - మత్తుదందాలో ప్రధాన పాత్ర డీజేలదే! - DRUGS USAGE IN HYDERABAD PUBS

మత్తు పదార్థాలకు అడ్డాగా పబ్బులు- వరుస దాడులతో హడలెత్తిస్తున్న న్యాబ్​ - TG NAB POLICE RAIDS IN PUBS

Last Updated : Oct 27, 2024, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.