Police Investigation on Rowdy Sheeter Borugadda Anil in Guntur : రౌడీషీటర్, వైఎస్సార్సీపీ సానుభూతి పరుడైన బోరుగడ్డ అనిల్‌కుమార్ పోలీసుల విచారణకు సహకరించకుండా, సరైన సమాధానాలు చెప్పకుండా వాస్తవాలు దాస్తున్నట్లు తెలుస్తోంది. కర్లపూడి బాబు ప్రకాష్‌ను రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డను న్యాయస్థానం మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇవ్వగా గుంటూరు అరండల్ పేట పోలీసులు రెండు రోజులుగా విచారణ చేస్తున్నారు. మాజీ సీఎం జగన్‌కు మద్దతుగా, నాటి ప్రతిపక్ష నేతలపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు ఎందుకు చేశావని పోలీసులు ప్రశ్నించగా నిజాలు చెబితే వైఎస్సార్సీపీ నుంచి ప్రాణహాని ఉండొచ్చనే భయంతో పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అసలు మాజీ సీఎం జగన్ ఎవరో తెలియదని బోరుగడ్డ సమాధానం చెప్పడానికి ఆ పార్టీ పెద్దల బెదిరింపులు కారణమై ఉండొచ్చువని పోలీసులు అనుమానిస్తున్నారు.
నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు నమోదు
జగన్ ఎవరో తెలియదు : గుంటూరుకు చెందిన కర్లపూడి బాబూ ప్రకాష్‌ను రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్‌ను అరండల్‌పేట పోలీసులు రెండురోజుల నుంచి విచారిస్తున్నారు. వారు అడిగిన అనేక ప్రశ్నలకు తెలియదని జవాబు ఇచ్చినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి చాలా అభ్యంతకరంగా మాట్లాడారు కదా? వారిని తిట్టాలని మిమ్మల్ని ప్రోత్సహించిన నాయకులు ఎవరు? అని పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏం ఆశించి వారిని తిట్టారని ప్రశ్నిస్తే అసలు నాకు ఏ వైఎస్సార్సీపీ నాయకులతో సంబంధం లేదని, జగన్ ఎవరో తెలియదని చెప్పినట్లు సమాచారం. జగన్‌తో పరిచయం లేదని బుకాయించినట్లు తెలిసింది. కర్లపూడి బాబూ ప్రకాష్‌ను బెదిరించటం వల్ల కలిగిన లబ్ధి ఏమిటని అడగ్గా అసలు నేనెవర్ని బెదిరించలేదన్నారు. బెదిరింపులకు పాల్పడిన సీసీ ఫుటేజీలు ముందు ఉంచితే నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది.
వైఎస్సార్సీపీ నేతల ఒత్తిడి, ప్రోద్బలంతోనే రెచ్చిపోయా : బోరుగడ్డ అనిల్
ఆ పెద్దలు ఎవరు? : వైఎస్సార్సీపీ హయాంలో మీపై అనేక మంది ఫిర్యాదు లొచ్చినా కేసులు నమోదుకాకపోవటానికి నాటి ప్రభుత్వ ఒత్తిడే కారణమా అని అనిల్‌ను ప్రశ్నిస్తే నాకు వైఎస్సార్సీపీతో సంబంధం లేదని చెబుతున్నా వినిపించుకోరేంటి ? అని బదులిచ్చినట్లు సమాచారం. తన వెనక ఇద్దరు పెద్దలు, ఒక లీగల్ అడ్వయిజర్ ఉన్నారని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ పెద్దలు ఎవరు? వారితో మీకున్న అనుబంధం ఏమిటని అడిగితే వారి గురించి చెబితే ప్రాణహాని ఉండొచ్చని భయపడినట్లు వినికిడి. ప్రాణహాని ఎవరి నుంచి ఉందో చెబితే వారి నుంచి ఎలాంటి ముప్పు లేకుండా చూస్తామని చెప్పినా పేర్లు వెల్లడించటానికి జంకినట్లు తెలుస్తోంది. ఇంతకీ మీరు ఏపార్టీలో ఉన్నారని అడగ్గా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ). ఆ పార్టీకి నేనే రాష్ట్ర అధ్యక్షుడిని తెలిపారు. మీకు ఆ పార్టీతో సంబంధం లేదని సస్పెండ్ చేసినట్లు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా నన్ను ఎవరు సస్పెండ్ చేసేది నేనే అధ్యక్షుడినైతేనంటూ అనిల్ బదులిచ్చినట్లు సమాచారం.
ఎట్టకేలకు చిక్కిన బోరుగడ్డ అనిల్ - ఈనెల 29 వరకు రిమాండ్
తోబుట్టువుల సహకారంతో కొనుగోలు : విశాఖలో ఓ భూవివాదంలో తలదూర్చి కారు పట్టుకొచ్చి వాడుకుంటున్నది నిజం కాదా అని పోలీసులు అనిల్‌ను ప్రశ్నిస్తే తోబుట్టువుల సహకారంతో కొనుగోలు చేశానని చెప్పినట్లు సమాచారం. ఆస్తిపాస్తుల గురించి వివరాలు కోరగా మౌనం వహించినట్లు తెలుస్తోంది. అయితే విచారణకు అనిల్ సహకరించటం లేదని,ఏం అడిగినా తెలియదని చెబుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లి రిమాండ్ పొడిగించాలని కోరే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది.
బోరుగడ్డ అనిల్ అరెస్ట్ - వైఎస్సార్సీపీ హయాంలో రెచ్చిపోయిన నిందితుడు