ETV Bharat / state

విశాఖ-దుర్గ్ వందే భారత్​ను ప్రారంభించిన ప్రధాని మోదీ - ఈనెల 20 నుంచి రెగ్యులర్‌ సర్వీస్‌ - Vande Bharat Inauguration - VANDE BHARAT INAUGURATION

PM Modi Inaugurated Vande Bharat Trains: విశాఖపట్నం-దుర్గ్​ వందేభారత్ ట్రైన్​ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అంతే కాకుండా పలు వందే భారత్‌ రైళ్లకు మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో విశాఖలో ప్రారంభించిన వందే భారత్ ట్రైన్​కు కేంద్ర మంత్రి రామ్మెహన్ నాయుడు జెండా ఊపారు.

vande_bharat_inauguration
vande_bharat_inauguration (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 7:31 PM IST

PM Modi Inaugurated Vande Bharat Trains: ప్రధాని నరేంద్ర మోదీ దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ ట్రైన్​ను వర్చువల్‌గా ప్రారంభించారు. అంతే కాకుండా పలు వందే భారత్‌ రైళ్లకు మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటికే విశాఖ- సికింద్రాబాద్, భువనేశ్వర్- విశాఖ, సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇది విశాఖ నుంచి ప్రయాణించే నాలుగవ ట్రైన్ అవుతోంది.

Visakha Vande Bharat Train Timings: దుర్గ్-విశాఖపట్నం వందే భారత్ దుర్గ్ నుంచి వారానికి 6 రోజులు (గురువారాలు మినహా) 05.45 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు 13.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ-దుర్గ్ (20830) వందే భారత్ విశాఖ నుంచి వారానికి 6 రోజులు (గురువారాలు మినహా) 14.50 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 22.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈ నెల 20 నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరగనుంది.

విశాఖలో ప్రారంభమైన ట్రైన్: విశాఖ నుంచి రాయపూర్​కి వెళ్లే వందే భారత్ రైల్​ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ సర్వీస్ తిరుగుతుందని అన్నారు. ఈ సర్వీస్​ను పార్వతీపురంలో నిలిపేందుకు కృషి చేశామని తెలిపారు. రైల్వే ద్వారా దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారు.

ఇప్పటికే విశాఖకు 3 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టామని వివరించారు. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ దేశంలోనే పూర్తి కెపాసిటీతో నడుస్తున్న రైల్​గా నిలిచిందని అన్నారు. 14 లక్షల ఉద్యోగులు ఉన్న రైల్వేను అప్ గ్రేడ్ చేస్తున్నామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో త్వరలో విశాఖ రైల్వే జోన్​కి భూమి పూజ చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

ఈ నెల 20 నుంచి రెగ్యులర్‌గా వందే భారత్ సర్వీస్‌ తిరుగుతుంది. ఈ సర్వీస్‌ను పార్వతీపురంలో నిలిపేందుకు ఎంతో కృషి చేశాము. రైల్వే ద్వారా దేశంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విశాఖకు 3 వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టడం జరిగింది. 14 లక్షల ఉద్యోగులు ఉన్న రైల్వేను అప్‌గ్రేడ్‌ చేస్తున్నాము. త్వరలోనే విశాఖ రైల్వే జోన్‌కు భూమి పూజ చేస్తాము. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ దేశంలోనే పూర్తి కెపాసిటీతో నడుస్తున్న రైల్​గా నిలించింది.- రామ్మోహన్‌ నాయుడు, కేంద్ర మంత్రి

జానీ మాస్టర్​పై లైంగిక ఆరోపణలు - పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టిన జనసేన - RAPE CASE AGAINST JANI MASTER

ఏఐ సాయంతో నీటి వృథాను ఆరికట్టే పరికరాన్ని డిజైన్ చేశాం - పేటెంట్‌ పొందాం: నాగార్జున - Guntur Man Developed Water Sensor

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.