People Facing Poblems Due to Jagan Visakha Tour : విశాఖలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. జగన్ పర్యటన నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాడిసన్ బ్లూలో జరిగిన విజన్ విశాఖ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం కన్వెన్షన్ సెంటర్లో జరిగిన యువతుతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం పర్యటన సందర్భంగా విశాఖ ఎండాడ, మధురవాడ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా ఆంక్షలు పెట్టారు.
సీఎం జగన్ విశాఖ పర్యటన - బస్టాప్ వద్ద ఉండొద్దని పోలీసుల హుకుం
ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు ఉన్న ప్రాంతం కావడంతో ఐటీ ఉద్యోగులు, ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ఎండాడలోని ఒక నర్సింగ్ కాలేజీ విద్యార్థులను సీఎం కోసం ఉదయం నుంచి ఎండలో నిలబెట్టి ముఖ్యమంత్రి వచ్చే సమయంలో పూల వర్షం కురిపించారు. సీఎంలు ప్రసన్నం చేసుకోవడానికి అధికారులు, రాజకీయ నేతలు సైతం అడుగడుగునా ఫ్లెక్సీలతో నగరాన్ని నింపేశారు. సీఎం వచ్చే సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు మరింత కఠినతరం చేయడంతో సమన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
AP CM YS Jagan Visakha Tour : అలాగే ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో మహిళలు తీవ్ర అసహనానికి గురయ్యారు. సీఎం సందర్శించే ప్రాంతాల్లో ఆయనకు స్వాగతం పలికేందుకు వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో మహిళలను తరలించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ వచ్చే ఐటీ హిల్ ప్రాంతంలోనూ మధురవాడ వీ కన్వెన్షన్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు మహిళలను పెద్ద సంఖ్యలో తరలించారు.
సీఎం జగన్ విశాఖ పర్యటన.. పోలీసుల అత్యుత్సాహం.. బెజవాడవాసులకు ట్రాఫిక్ కష్టాలు
సీఎం ఐటీ హిల్ ప్రాంతం నుంచి వీ కన్వెన్షన్ కు మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సి ఉన్నప్పటికీ ఆయనకు స్వాగతం పలికేందుకు మహిళలను ఉదయం 10 గంటల నుంచే ఎండలో నిలబెట్టారు. గంటల తరబడి ఎండలో నిలబడిన మహిళలు తీవ్ర అసహనానికి గురయ్యారు. చివరకు సీఎం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు వీ కన్వెన్షన్ కు చేరుకోవడంతో మహిళలు ఆయన కాన్వాయ్‌పై మొక్కుబడిగా పూలు జల్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహిస్తుండడంతో దానిని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ఆపసోపాలు పడుతోంది. ఇటీవల కాలంలో విశాఖలో సీఎం కార్యక్రమాలను సక్సెస్ చేసే బాధ్యతను అధికారులపై పెడుతున్న సంగతి తెలిసిందే. గత నెలాఖరుల శారదా పీఠానికి వచ్చినప్పుడు విమానాశ్రయం నుంచి చినముషిడివాడ వరకు మహిళలను దారిపొడవునా ఎండలో నిల్చోబెట్టి స్వాగతం పలికించిన సంగతి తెలిసిందే.
CM Jagan Visakha Tour: విశాఖతో పాటు ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుస్తాం: సీఎం జగన్