ETV Bharat / state

'వారసత్వ భూములను కబ్జా చేశారు - ప్రశ్నిస్తే హత్యాయత్నం' - TDP PRAJAVEDIKA PROGRAM

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమం - పెద్ద ఎత్తున తరలివచ్చిన బాధితులు

tdp_prajavedika_program
tdp_prajavedika_program (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2024, 9:43 PM IST

People Complain to TDP Leaders on YSRCP Leaders Irregularities: వారసత్వంగా సంక్రమించిన భూమిని వైఎస్సార్​సీపీ నేతలు ఆక్రమించి అధికారుల అండదండలతో ఆన్‌లైన్‌లో భూ రికార్డులు మర్చారని, ఇదేమిటని ప్రశ్నిస్తే హత్యాయత్నం చేసారని ఒంగోలుకు చెందిన వెంకటేశ్వరరావు వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన 'ప్రజావేదిక'లో ఫిర్యాదు చేశారు.

పెద్ద ఎత్తున తరలివచ్చిన బాధితుల నుంచి ప్రభుత్వ చీఫ్‌ విప్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, నేత డేగల ప్రభాకరరావు వినతులు స్వీకరించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. పింఛన్‌ ఇవ్వడానికి సచివాలయ ఉద్యోగి లంచం డిమాండ్‌ చేశారని కడపకు చెందిన వృద్ధురాలు శివమ్మ వాపోయారు. తన వద్ద 15 లక్షలు తీసుకొని స్థలాన్ని అమ్మిన జగదీశ్వర్రావు అదే భూమిని మరొకరికి కూడా విక్రయించి మోసం చేశారని తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన మారుతీరావు ఫిర్యాదు చేసారు.

కడపలో వృద్ధాశ్రమం ఏర్పాటుకు స్థలం మంజూరు చేయాలని సుగుణాకరరావు కోరారు. వెన్నుపూస సమస్యతో బాధపడుతున్న తన కుమారుడి వైద్యానికి 15 లక్షల వరకు ఖర్చవుతుందని సీఎంఆర్‌ఎఫ్‌ కింద సాయం చేసి ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన సూరప్పడు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం తమపై బనాయించిన అక్రమ కేసుల్ని తొలగించాలని మాచర్ల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. రహదారి ఆక్రమించి రాకపోకలకు అడ్డంకులు సృష్టిస్తున్న ఆనందరావుపై చర్యలు తీసుకోవాలని మంగళగిరికి చెందిన వందనం ఫిర్యాదు చేశారు.

రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు - జనవరి నుంచి పనులు

సచివాలయానికి చేరిన కూటమి నేతల ఫ్లైయాష్ వివాదం - సీఎం ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.