PCC President Sharmila Election Campaign in YSR District : కాంగ్రెస్ తరపున కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో జగన్‌పై విమర్శల పదును పెంచారు. సొంత చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్‌రెడ్డికి ఏ విధంగా ఎంపీ టికెట్ ఇస్తారని నిలదీశారు. సీబీఐ దగ్గర అన్ని ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా అవినాష్‌రెడ్డి ఒక్కరోజూ జైలుకెళ్లకుండా ఎవరూ అండగా నిలుస్తున్నారని ప్రశ్నించారు.
Maidukuru Constituency YSR District : న్యాయ బస్సు యాత్రలో వైఎస్‌ఆర్ జిల్లాలో పర్యటిస్తున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె సునీత నాల్గోరోజు మైదుకూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యాత్రలో జగన్, అవినాష్‌పై నిప్పులు చెరిగారు. ప్రజలు ఓట్లు వేసి అధికారం అప్పగిస్తే హత్యలు చేయడానికి శిక్షలు పడకుండా తప్పించుకునేందుకు వాడుకుంటున్నారని షర్మిల మండిపడ్డారు. వివేకా హత్యపై సీబీఐ చెప్పిన సాక్ష్యాధారాల ఆధారంగానే మాట్లాడుతున్నట్లు షర్మిల స్పష్టం చేశారు.మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై షర్మిల ఘాటైన విమర్శలు చేశారు. ఎమ్మెల్యే ఎప్పుడైనా నియోజకవర్గంలో కనిపించాడా? ఎవరికైనా సహాయం చేశాడా? అంటూ ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడని ఎమ్మెల్యే ఎందుకంటూ మండిపడ్డారు.
' సీబీఐ చెప్పిందే మేము చెబుతున్నాం. హత్య జరిగనప్పుడు మాకు తెలియదు. దస్తగిరిలాంటి నిందితుడ్ని పట్టుకుని ఆధారాలు బయటపడితే మాకు అర్థం కాలేదు. సీబీఐ కేసు ఛేదించాకే అవినాష్‌రెడ్డి వ్యవహారం తెలిసింది. మేము ఆధారాలు లేకుండా ప్రజల మధ్యలోకి రాలేదు. ప్రజలు మంచి చేయాలని అధికారం ఇస్తే హత్య చేయడానికి వాడుకుంటున్నారు. దీనికి ఎమ్మెల్యే సమాధానం చెప్పగలరా? ' _పీసీసీ అధ్యక్షురాలు షర్మిల
సీఎం జగన్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడు కాదు: షర్మిల - YS Sharmila Allegations On Jagan
YS Sunitha Comment YCP Goverment : వివేకాను దారుణంగా హత్యచేసిన వారికి ఓటు వేయోద్దని ఆయన కుమార్తె సునీత మరోసారి స్పష్టంచేశారు. కడప ఎంపీగా షర్మిలను గెలిపిస్తే వివేకా ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పారు. ఉగాది, రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని ఎన్నికల ప్రచారానికి షర్మిల తాత్కాలిక విరామం ఇచ్చారు. తిరిగి 12వ తేదీన పులివెందుల నుంచి ప్రచారం ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.