Panuganti Chaitanya Remand Extended: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో ఏ1 నిందితుడిగా ఉన్న పానుగంటి చైతన్యకు కోర్టు మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. 3 రోజుల సీఐడీ కస్టడీ ముగియడంతో అధికారులు ఈ రోజు గుంటూరులోని 6వ అదనపు న్యాయస్థానంలో హాజరుపరిచారు. మూడు రోజుల సీఐడీ కస్టడీలో అధికారుల ప్రశ్నలకు స్పందించని చైతన్య అన్నింటికీ తెలియదు, గుర్తులేదు, మరచిపోయాననే చెప్పి విచారణకు సహకరించకపోవడంతో ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం పానుగంటి చైతన్యకు మరో 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు పానుగంటి చైతన్యను తిరిగి కోర్టు నుంచి జిల్లా జైలుకు తరలించారు.
రెచ్చగొట్టి దాడికి పంపారు : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి ముందు వైఎస్సార్సీపీ ఆఫీసులో ఆ పార్టీ ముఖ్య నాయకులు భేటీ అయ్యారని పానుగంటి చైతన్య సీఐడీ విచారణలో చెప్పినట్లు తెలిసింది. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు మధ్యాహ్నం 3 గంటలకు తన అనుచరులు తియ్యగూర గోపిరెడ్డి, పేరూరి అజయ్, రామిశెట్టి విశాల్ తదితరులతో గుంటూరు నాజ్ సెంటర్లో ఉన్నట్లు చైతన్య చెప్పినట్లు సమాచారం. అప్పుడు వైఎస్సార్సీపీ నేత నూనె ఉమామహేశ్వర్‌రెడ్డి ఫోన్ చేసి వెంటనే తనను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లాలని సూచించినట్లు అధికారుల ముందు చైతన్య ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
మీరు లెటర్లు రాసుకుంటే చంద్రబాబుకు ఏం సంబంధం? - ఆ విషయంలో జడ్జి విజయమ్మే : బాలినేని
కీలకాంశాలపై ప్రశ్నించిన సీఐడీ : వైఎస్సార్సీపీ నాయకుడు ఉమామహేశ్వరరెడ్డి నాజ్ సెంటర్‌కు రాగా అనుచరులు కారులో తాడేపల్లికి వెళ్లినట్లు విచారణలో చైతన్య వెల్లడించినట్లు సమాచారం. ఆ సమయంలో కారులో ఉమామహేశ్వరరెడ్డితో పాటు గడ్డంతో ఉన్న మరో వ్యక్తి ఉన్నారని చెప్పినట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ కార్యాలయానికి వెళ్లే సమయానికి పార్టీ ముఖ్య నేతలు అక్కడే ఉన్నారని చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత సమావేశంలో పాల్గొన్న నేతల నుంచి వచ్చిన ఆదేశాలతో అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న 200 మంది కార్యకర్తలతో కలిసి టీడీపీ కార్యాలయంపై దాడికి వెళ్లినట్లు చైతన్య పోలీసులకు వివరించినట్లు సమాచారం.
Mangalagiri TDP Office Case Updates : జగన్‌ను దూషించిన పట్టాభిపై దాడి చేయాలని అనుకున్నామని ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో టీడీపీ కార్యాలయంలో ఉన్న వారిపై దాడి చేశామని అధికారుల ముందు చైతన్య ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దేవినేని అవినాశ్ మరి కొందరు మంగళగిరి వచ్చి దాడి తీరును పరిశీలించారని ఆ సమయంలో అక్కడకు వచ్చిన మంగళగిరి రూరల్ సీఐ, ఓ కానిస్టేబుల్‌పై తాను దాడి చేసినట్లు పానుగంటి విచారణలో అంగీకరించినట్లు సమాచారం. మూడు రోజుల కస్టడీ ముగియడంతో నేడు చైతన్యను సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు.
"ఆలోచన, ప్రవర్తనలో మార్పు వస్తే ప్రేమ పునరుద్ధరిస్తా" - షరతులు వర్తిస్తాయన్న జగన్
అన్నగా, మేనమామగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందే - జగన్‌కు షర్మిల కౌంటర్