ETV Bharat / state

వైసీపీ నాయకుల వేధింపులు, అధికారుల ఒత్తిళ్లకు ఇంజినీర్ బలి - కార్యాలయంలోనే ఆత్మహత్య

Panchayati Raj JE Suicide due to YSRCP Leaders Harassment: అధికార పార్టీ నాయకుల మోసాలకు అమాయక అధికారులు బలవుతున్నారు. గ్రామాల్లో కొత్త భవన నిర్మాణాలకు వాడుకున్న సిమెంట్‌ను ఇవ్వకుండా అధికారులపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. మీ సంగతి తేలుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇటు నాయకుల బెదిరింపులు, సరఫరా చేసిన సిమెంట్‌కు లెక్కలు చెప్పాలంటూ అటు అధికారుల ఒత్తిళ్లతో ఇంజినీర్లు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. వేధింపులు భరించలేక విజయనగరం జిల్లా రాజాంకు చెందిన పంచాయతీరాజ్ ఇంజినీర్ రామకృష్ణ ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

Panchayati_Raj_JE_Suicide_due_to_YSRCP_Leaders_Harassment

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 7:07 AM IST

వైసీపీ నాయకుల వేధింపులు, అధికారుల ఒత్తిళ్లకు ఇంజినీర్ బలి - కార్యాలయంలోనే ఆత్మహత్య

Panchayati Raj JE Suicide due to YSRCP Leaders Harassment: కొండలు, గుట్టల్నే కాదు, సిమెంట్‌ను సైతం అధికార వైసీపీ నాయకులు బొక్కేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో గ్రామాల్లో చేస్తున్న భవన నిర్మాణాలకు వైఎస్సార్ నిర్మాణ్ పేరిట ప్రభుత్వం వివిధ కంపెనీల నుంచి సిమెంట్ సరఫరా చేసింది. నిల్వ చేసేందుకు గ్రామాల్లో తగిన సౌకర్యం ఉందా లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా వందల టన్నుల్లో సిమెంట్ బస్తాల్ని పంపింది.

భవన నిర్మాణాలకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులు అక్కడే నిలిచిపోయాయి. సిమెంట్ బస్తాలు సకాలంలో వినియోగించక పోవడం వలన కొన్నిచోట్ల గట్టి పడటం మొదలైంది. ఈ తరుణంలో మండల, గ్రామ స్థాయి వైసీపీ నాయకులు ఇతర కాంట్రాక్టు పనులకు ఆ సిమెంట్‌ను వాడుకున్నారు. అవసరమైనప్పుడు తిరిగిస్తామని చెప్పడంతో ఇంజినీర్లూ కాదనలేదు. గత ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తైన కొన్ని భవనాలకు తుది బిల్లుల చెల్లింపులకు ఆన్‌లైన్‌లో మండల ఇంజినీర్లు వివరాలు అప్ లోడ్ చేస్తున్నారు.

తిరిగి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో: ఆ సమయంలో ప్రభుత్వం సరఫరా చేసిన సిమెంట్‌ లెక్కలు చూపాల్సి వస్తోంది. భవన నిర్మాణానికి సరఫరా చేసిన సిమెంట్ బస్తాలెన్ని, వీటిలో వినియోగించనివి ఎన్ని, మిగిలిన బస్తాల వివరాలు, బిల్లులు సహా అప్లోడ్ చేయాలి. మిగులు బస్తాలకు సంబంధించిన నిల్వలను అధికారులకు చూపించాలి. తిరిగి ఇస్తామని చెప్పి సిమెంట్ను తీసుకెళ్లిన వైసీపీ నాయకులు ఇవ్వకపోవడంతో ఇంజినీర్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

వై​సీపీ కౌన్సిలర్​ వేధిస్తున్నారని అటెండర్​ ఆత్మహత్యాయత్నం - సెల్ఫీ వీడియో

సిమెంట్ తిరిగి ఇవ్వకపోగా ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వైసీపీ నాయకులు ఇంజినీర్లపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. మరోసారి అడిగితే ఫిర్యాదులు చేస్తామని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ఇటు నాయకులు మోసం, అటు ఉన్నతాధికారుల నుంచి సిమెంట్ లెక్కలు చెప్పాలన్న ఒత్తిడి ఎక్కువ కావడంతో ఇంజినీర్లు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

వైసీపీ నాయకుల మోసం, అధికారుల ఒత్తిళ్ల కారణంగా విజయనగరం జిల్లా రాజాం పంచాయతీరాజ్ శాఖ సబ్‌డివిజన్ కార్యాలయంలోనే రేగిడి మండల ఇన్చార్జి జేఈ రామకృష్ణ ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. రేగిడి మండలంలో భవనాల పనుల కోసం రెండు సంవత్సరాల కిందట 10 వేల బస్తాల సిమెంటును ప్రభుత్వం సరఫరా చేసింది. భవనాల పనులు ప్రారంభించిన గుత్తేదారులకు సకాలంలో బిల్లులు మంజూరు కాలేదు. వారు పనుల్ని మధ్యలోనే నిలిపేశారు.

సిమెంట్‌ బస్తాలు గడ్డకట్టి పాడైపోతాయనే భయంతో అధికారులు ఇతర పనులకు ఎక్కడికక్కడ దాన్ని సర్దుబాటు చేశారు. పలువురు వైసీపీ నాయకులు సిమెంటు తీసుకుని, వాడుకున్నారు. తర్వాత భవనాల పనులకు సంబంధించిన బిల్లులు రావడంతో గుత్తేదారులు మళ్లీ పనులు మొదలు పెట్టారు. తమకు సిమెంటు కేటాయించాలని కోరారు. సిమెంట్‌ను వాడుకున్న వైసీపీ నాయకులు తిరిగి ఇవ్వలేదు. మరోపక్క సిమెంట్‌కు సంబంధించిన లెక్కలు చెప్పాలంటూ జేఈ రామకృష్ణను బాధ్యుడిని చేస్తూ అధికారులు ఒత్తిడి పెంచారు.

వైఎస్సార్సీపీ నేతల భూ కబ్జా: చంపేస్తానంటూ బెదిరింపులు

తనలోతాను తీవ్రంగా కుమిలిపోతూ: మానసికంగా తీవ్ర ఆందోళనకు గురైన ఆయన ఏం చేయాలో తెలియక తనలోతాను తీవ్రంగా కుమిలిపోయేవారు. సమాధానం చెప్పాలంటూ ఉన్నతాధికారులు నిలదీస్తుండటంతో 3రోజుల క్రితం ఒత్తిడికి తట్టుకోలేను, ఆత్మహత్య చేసుకుంటానని భార్యకు చెప్పి కన్నీరు పెట్టుకున్నారు. ఆమె భర్తకు ధైర్యం చెప్పారు. రెండు రోజుల కిందట ఉమాదేవి బొబ్బిలిలోని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారితో ఈ విషయమై చరవాణిలో మాట్లాడారు. మా వారి పరిస్థితి బాగోలేదు. చనిపోతానంటున్నారు. ఆయనపై ఒత్తిడి పెంచకండని వేడుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది.

పంచాయతీరాజ్ ఇంజినీర్ రామకృష్ణ ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అధికారుల వేధింపులపై ఇంజినీర్లు కొద్దినెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. భవిష్యత్‌లో ఇబ్బందులుండవని ప్రభుత్వం హామీ ఇచ్చి, మళ్లీ వేధింపులకు గురి చేయడంపై ఇంజినీర్లు మండిపడుతున్నారు.

ఒంటరి మహిళపై వైఎస్సార్సీపీ నాయకుల దారుణం

ఉపాధి హామీ మెటీరియల్ నిధులతో గ్రామాల్లో చేసే వివిధ పనులకు తెలుగుదేశం హయాంలో పంచాయతీలే సిమెంట్ను సేకరించేవి. ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండేది కాదు. పనులకు ఎన్ని సిమెంట్ బస్తాలు ఉపయోగించారో మండల ఇంజినీర్లు రికార్డు చేసి బిల్లులు చెల్లించేవారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వైఎస్సార్ నిర్మాణ్ పేరుతో కొత్త విధానం తీసుకొచ్చింది. నిర్మాణ పనుల అవసరాల మేరకు ప్రభుత్వమే సిమెంట్ కంపెనీల ద్వారా సరఫరా చేయిస్తోంది.

భవన నిర్మాణ పనుల్ని చేయించే పంచాయతీలకు బిల్లుల్ని సకాలంలో చెల్లించకపోయినా, సిమెంట్ కంపెనీలకు మాత్రం ఎప్పటికప్పుడు మెటీరియల్ నిధుల్లో నుంచి ఇస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపుల బాగోతం నడుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తమున్నట్లు ప్రచారం సాగుతోంది.

వైఎస్సార్సీపీ నేతల వేధింపులు - రైతు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.