ETV Bharat / state

పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ ​- నీళ్లు, వీధిదీపాలు, పారిశుద్ధ్యం పనులు వేగవంతం - Panchayati Raj Funds Released in AP - PANCHAYATI RAJ FUNDS RELEASED IN AP

Panchayati Raj Funds Released in AP : వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసింది. కేంద్రం ఇచ్చిన 14, 15వ ఆర్ధిక సంఘం నిధులను సర్పంచులకు, కార్యదర్శులకు తెలియకుండా జేబులో వేసుకుంది. వాటి ఆర్థిక మూలాలకు గండికొట్టి, అభివృద్ధిని అడ్డుకుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేసింది. పల్లెలకు జీవం పోసింది.

panchayati_raj_funds_released_in_ap
panchayati_raj_funds_released_in_ap (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 2:55 PM IST

Panchayati Raj Funds Released in AP : కూటమి ప్రభుత్వం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఊపిరి పోసింది. 2023 – 24 ఆర్థిక సంవత్సరం రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. విజయనగరంలోని 775 పంచాయతీలకు రూ. 30 కోట్ల 73 లక్షలు, మన్యం జిల్లాల్లోని 456 పంచాయతీలకు 16 కోట్లు విడుదల చేసింది. మండల పరిషత్తుకు సంబంధించి ఉమ్మడి జడ్పీకి రూ.16 కోట్ల 48 లక్షలు నిధులిచ్చింది. దీంతో పారిశుద్ధ్యం, రక్షిత తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ పనులు వేగవంతం అవుతున్నాయి.

'గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులకు అందిన 15వ ఆర్థిక సంఘం నిధులతో పారిశుద్ధ్యం, రక్షిత నీటి సరఫరా పథకాలు, వీధి దీపాల నిర్వహణతో పాటు, సిబ్బంది జీతాలు, పంచాయతీల సుస్థిరాభివృద్ధికి ఖర్చు చేయవచ్చు. గత ఐదేళ్లలో సర్పంచులు గ్రామాల్లో ఉత్సవ విగ్రహల్లా మారారు. కనీస గౌరవం లేదు. ఏ పని చేయాలన్నా పంచాయతీల్లో పైసా లేని దుస్థితి. ప్రస్తుత ప్రభుత్వ హయంలో ఆ బాధలు తప్పాయి.' -సోమి నాయుడు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు

మంగళగిరిలో వన మహోత్సవం - పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ - vana mahotsavam program

Funds Released by Center are Directly Credited to Accounts of Panchayats : గత రాష్ట్ర ప్రభుత్వం పల్లెల బాగు కోసం ప్రత్యేక నిధులు విడుదల చేయకపోగా, కేంద్రం ఇచ్చిన వాటినీ ఇతర అవసరాలకు వాడుకోవటంపై అప్పట్లో పంచాయతీల సర్పంచ్​లు గళమెత్తారు. పెద్ద ఎత్తున ఆందోళనలు సైతం చేపట్టారు. కానీ పంచాయతీల పాలకులకు ఒనగూరిన ప్రయోజనం శూన్యం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం, గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించటంతో పాటుగా కేంద్రం విడుదల చేసిన నిధులను నేరుగా పంచాయతీల ఖాతాలకు జమ చేయటంపై రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతి నిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

2014-19 కాలం తరహాలో చిన్న పంచాయతీల విద్యుత్తు బిల్లలును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ రాజ్‌ శాఖ పరిధిలోని రోడ్లు గుంతలు పడి అధ్వానంగా ఉన్నాయి. ఎంతోకాలంగా కొత్తవి నిర్మించడంతో పాటు పాతవి పునర్నిర్మించడానికి నిధుల కోసం ఎన్నోసార్లు ప్రతిపాదనలు పంపినా రాలేదు. దాంతో ఏటా వర్షాలు, వరదలకు రోడ్లన్నీ గుంతలు పడి ప్రయాణానికి నరకంగా మారాయి. ఇప్పుడు వీటికి మోక్షం కలగనుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వ బంగారు సంకల్పం - నేడు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు - Grama Sabhalu in AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.