ETV Bharat / state

'రాష్ట్రంలో బీర్లు పుష్కలం - కొరతేమీ లేదు!' - No Shortage Of Liquor Stocks

No Shortage Of Liquor Stocks: మందుబాబులకు అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో భారతీయ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్ఎల్) ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు కనీసం 20 రోజుల వరకు సరిపోతాయని తెలిపారు.

No Shortage Of Liquor Stocks in AP
No Shortage Of Liquor Stocks in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2024, 11:09 AM IST

No Shortage Of Liquor Stocks in AP : రాష్ట్రంలో భారతీయ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్ఎల్) ఎటువంటి కొరత లేదని అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ (Nishant Kumar) తెలిపారు. వినియోగానికి అవసరమైన మేరకు నిల్వలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని అన్నారు. సాధారణంగా 90,000 కేసుల ఐఎంఎఫ్ఎల్, 23,000 కేసుల బీరు రాష్ట్రంలో రోజువారీ సగటు వినియోగంగా ఉందని, ప్రస్తుతం ఉన్న నిల్వలు కనీసం 20 రోజుల వరకు సరిపోతాయని స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిక్కర్ డిపోలలో 20 లక్షల కేసుల ఐఎంఎఫ్ఎల్, 5.6 లక్షల కేసుల బీర్ విక్రయానికి అందుబాటులో ఉందని నిషాంత్ కుమార్ తెలిపారు. విభిన్న అవుట్ లెట్​ల పరంగా 6.93 లక్షల కేసుల ఐఎంఎఫ్ఎల్ సిద్దంగా ఉందని, పూర్వపు సగటు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నిల్వ 9 రోజులు సరిపోతుందని పేర్కొన్నారు. కేవలం వరదల కారణంగా తగిన నిల్వ సామర్ధ్యం లేక ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని కొన్ని అవుట్ లెట్లతో మాత్రమే నిల్వలు తగ్గుముఖం పట్టాయని ఆయన అన్నారు.

తక్కువ ధరకు అన్ని బ్రాండ్లు అందుబాటులోకి ​ - త్వరలో నూతన మద్యం పాలసీ! - ap liquor policy 2024

ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం : ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్‌ విడుదలకు ఎక్సైజ్‌శాఖ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్‌ ఆమోదం కోసం సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ వద్దకు పంపనుంది. రేపటిలోగా గవర్నర్‌ ఆమోదం తెలిపే అవకాశముంది.

రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఇందులో 34 షాపులు కల్లుగీత వృత్తి దారులకు కేటాయించనున్నారు. రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశంపై అబ్కారీశాఖ కసరత్తు చేస్తోంది. కల్లుగీత వృత్తి కులాల జనాభా ఏయే జిల్లాల్లో ఏ మేరకు ఉన్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు. కల్లుగీత వృత్తి కులాల జనాభా ప్రాతిపదికనే మద్యం షాపులను ఎక్సైజ్‌ శాఖ రిజర్వు చేయనుంది.

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - సరసమైన ధరలకే లిక్కర్ అందించేలా కొత్త ఎక్సైజ్ పాలసీ - ఆ రోజు నుంచే అమలు - New Liquor Policy in AP

రాష్ట్రంలో 3,736 మద్యం షాపులు - రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ - New Liquor Shops Notification

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.