ETV Bharat / state

సోషల్​ మీడియాలో చేస్తున్న ఆ ప్రచారం అవాస్తవం - ఆర్పీ సిసోడియా - RP Sisodia on AP Floods

వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్యలపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాన్ని ఖండించిన ప్రభుత్వం

RP_Sisodia_on_AP_Floods
RP_Sisodia_on_AP_Floods (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2024, 11:07 AM IST

NDA Govt Condemned False Propaganda on Social Media on Flood Relief Measures : వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్యల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల‌కు రూ.23 కోట్ల రూపాయలు ఖ‌ర్చుచేశార‌ని సామాజిక మాధ్యమాల్లో కొంద‌రు చేస్తున్న అస‌త్య ప్రచారాల‌ను, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి ఆర్పీ సిసోదియా ఖండించారు. ప్రభుత్వంపై బుర‌ద చ‌ల్లడం కోసం, ప్రజ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించడం కోసం ఇలాంటి అస‌త్యాలను ప్రచారం చేస్తున్నార‌ని వివ‌రించారు. వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో విద్యుత్తు స‌ర‌ఫ‌రా లేక రాత్రిళ్లు ప్రజ‌లు తీవ్ర అవ‌స్థలు ప‌డ్డార‌ని, వారికి మొబైల్‌ జ‌న‌రేట‌ర్ల ద్వారా స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టామ‌ని తెలిపారు. ఈ ఖ‌ర్చు ప్రధానంగా మొబైల్‌ జ‌న‌రేటర్ల కోసం వెచ్చించింద‌ని చెప్పారు. దాంతోపాటు వ‌ర‌ద బాధితుల‌కు అగ్గిపెట్టెలు., కొవ్వొత్తులు కూడా అద‌నంగా అందించామ‌ని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని చేస్తున్న ఇలాంటి ప్రచారాల‌ను ప్రజ‌లు విశ్వసించ‌కుండా అప్రమ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న విజ్ఞప్తి చేశారు.

వరద సహాయక చర్యలపై కేంద్రం ప్రశంసలు - బాధితులకు ఉచితంగా సర్టిఫికెట్లు - RP Sisodia on AP Floods

వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం గణన- రేపటి నుంచే మూడు రోజుల్లో పూర్తి - AP Floods Damage

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.