ETV Bharat / state

భూ సేకరణలో అంతులేని అలసత్వం-కేంద్రం నిధులిచ్చినా అభివృద్ధి మార్గానికి అడ్డంకులు - WADAREVU PIDUGURALLA HIGHWAY - WADAREVU PIDUGURALLA HIGHWAY

National Highway Expansion Works Delay in Palnadu District : తెలుగురాష్ట్రాల అనుసంధాన రహదారిలో కీలకమైన వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం నిధులు మంజూరు చేసినా నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. భూసేకరణ జాప్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ఇరుకు రహదారిలో వాహనాలు ఢీకొని నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.

highway_expansion_delay
highway_expansion_delay (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 2:47 PM IST

National Highway Expansion Works Delay in Palnadu District : నిత్యం వందలాది వాహనాలు రయ్‌మంటూ దూసుకెళ్లే అత్యంత రద్దీ రహదారి అది. జిల్లా కేంద్రాన్ని గ్రామాలు, పట్టణాలతో అనుసంధానం చేసే ఈ రోడ్డు రద్దీకి అనుగుణంగా విస్తరణ చేపట్టకపోవడంతో ప్రమాదం జరగని రోజు లేదు. కనీసం మార్జిన్లు మరమ్మతులు చేయకపోవడంతో వాహనాలు బోల్తాకొట్టి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా సమస్యలను అధిగమించి రోడ్డు విస్తరణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

హైదరాబాద్‌-బెంగళూరు మధ్య సరికొత్త హైస్పీడ్ హైవే - మూడు రాష్ట్రాలను కలుపుతూ కేంద్రం కీలక నిర్ణయం - hyderabad bengaluru new highway

అడ్డంకిగా భూసేకరణ : పల్నాడు జిల్లాలో నరసరావుపేట-చిలకలూరిపేట పట్టణాలను కలిపే కీలక రహదారిలో నిత్యం వేలాది వాహనాలు ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. అడుగడుగునా మలుపులు, కొన్నిచోట్ల లోతైన గుంతలతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలుగురాష్ట్రాల అనుసంధానించేలా జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేసే క్రమంలో కేంద్రం ఈ రహదారిని వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారిగా ప్రకటించింది. నిధులు కేటాయించినా నిర్మాణం విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బాపట్ల జిల్లా పరిధిలో భూసేకరణ పూర్తయి పనులు జరుగుతున్నా పల్నాడు జిల్లాలో భూసేకరణ కొలిక్కిరాక పనులు ప్రారంభం కాలేదు .

హంద్రీ వంతెనపై భారీ గొయ్యి - వాహనదారులు ఆందోళన - Handri bridge

కేంద్ర నిధులు మంజూరు చేసిన జాప్యం : మొత్తం 85 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించి అభివృద్ధి చేయడానికి కేంద్రం రూ.1851 కోట్లు కేటాయించింది. వాడరేవు నుంచి చిలకలూరిపేట వరకు ఒక ప్యాకేజీగా విభజించారు. చిలకలూరిపేట నుంచి నకరికల్లు అడ్డరోడ్డు వరకు మరో ప్యాకేజీగా నిధులు కేటాయించారు. తొలి ప్యాకేజీ కింద బాపట్ల జిల్లాలో పనులు మొదలై జరుగుతున్నాయి. కానీ రెండో ప్యాకేజి నరసరావుపేట బైపాస్‌కు సంబంధించి 70 హెక్టార్ల భూ సేకరణలో జాప్యం కారణంగా పనులు మొదలుపెట్టలేదు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఇరుకు రోడ్డులో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చిలకలూరిపేట-నరసరావుపేట మధ్య 20 కిలోమీటర్ల పరిధిలో సమస్య ఎక్కువగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.

అమరావతిలో మరో రెండు రాచబాటలు - సీఆర్​డీఏ తాజా ప్రతిపాదన - Amaravathi National Highways

అయోమయంలో వాహనదారులు : ఈ రహదారిని కొన్ని చోట్ల విస్తరించి మరికొన్నిచోట్ల వదిలెయ్యడంతో కొత్తగా ఈ రోడ్డులోకి వచ్చేవారు అయోమయానికి గురవుతున్నారు. వేగంగా దూసుకువచ్చి వంతెనలు, కల్వర్టుల వద్దకు వచ్చేసరికి అవగాహన లేక బోల్తా కొట్టిస్తున్నారు. భారీ వాహనాలు ఢీకొన్ని ద్విచక్రవాహనదారులు చనిపోతున్నారు. వీలైనంత త్వరగా రహదారి విస్తరణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

హైదరాబాద్‌-బెంగళూరు హైవే విస్తరణ - రాయలసీమకు మహర్దశ - Hyderabad Bangalore Highway

పరిహారం పెంచాలని రైతులు డిమాండ్​ : పల్నాడు జిల్లాలో రహదారి విస్తరణకు అవసరమైన భూమి ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. అక్కడ భూముల విలువ ఎక్కువగా ఉండటంతో పరిహారం పెంచాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. భూసేకరణ సహా రోడ్డు నిర్మాణానికి మొత్తం నిధులు కేంద్రమే ఇస్తున్నా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీసం రైతులతో చర్చించకపోవడంతో ఈ రహదారి నిర్మాణ పనులు ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్లు నిలిచిపోయాయి. హైదరాబాద్ నగరాన్ని సముద్రతీర ప్రాంతానికి అనుసంధానం చేయడంలో ఈ మార్గం ఎంతో కీలకమైంది. చెన్నై నుంచి తెలంగాణ వైపు వెళ్లే వాహనదారులకు ఇది దగ్గరి దారి అవుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా భూసేకరణ సమస్యను పరిష్కరించి రహదారిని విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు.

రాష్ట్రంలో హైవేల విస్తరణకు కేంద్రం గ్రీన్​సిగ్నల్- రూ.2 లక్షల కోట్లతో పచ్చజెండా - 8 National Highways Expansion

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.