Narasapuram MPDO Deadbody Found in Eluru Canal : నర్సాపురం ఎంపీడీఓ (MPDO) వెంకటరమణారావు అదృశ్యం మిస్టరీ వీడింది. ఏలూరు కాలువలో ఆయన మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ (State Disaster Response Fund) బృందాలు గుర్తించాయి. విజయవాడలోని మధురానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కాలువలో కట్టెలు, చెట్ల మధ్యలో ఇరుక్కొని ఉన్న మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. వారం రోజులుగా మధురా నగర్ రైల్వే బ్రిడ్జి నుంచి ఏలూరు కాలువ వరకు. స్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు మృతదేహం లభ్యమైంది.
ఈ నెల 15న అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భార్య ఫోన్‌కు వెంకటరమణ సందేశం పంపారు. అందులో ‘ఈ రోజు నా పుట్టిన రోజు. నేను చనిపోయే రోజు కూడా’ అంటూ రాయడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళన చెంది 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు ఏలూరు కాలువ వద్ద సిగ్నల్ కట్ అయినట్లు గుర్తించారు. ఏలూరు కాల్వలోకి వెంకటరమణ దూకినట్లు పోలీసులు ముందుగానే భావించారు.
అదే కోణంలో దర్యాప్తు చెేసి, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కాలువలో గాలించారు. ఈ క్రమంలో నేడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో ఫోన్ సిగ్నల్ కట్ అయిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో నేడు ఎంపీడీఓ వెంకటరమణారావు మృతదేహం లభ్యమైంది. ఒత్తిడితోనే వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు, బెదిరింపులు కూడా దీనికి కారణమని ఆరోపణలు ఉన్నాయి.
'గాలింపు చర్యల్లో భాగంగా ఈ రోజు మధురానగర్ నుంచి వెతుకుతూ వస్తున్న సిబ్బందికి ఏలూరు కాలువలో చెట్టు కొమ్మ మధ్యలో ఇరుక్కుపోయి ఉన్న వెంకటరమణారావు మృతదేహం కనిపించింది. ప్రాథమికంగా లభించిన ఆధారాలను బట్టి కుటుంబ సభ్యులు అది ఆయన మృతదేహంగానే నిర్ధారించినా, మొహం గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో శాస్త్రీయ నిర్ధారణకోసం మృతదేహాన్ని డీఎన్ఏ టెస్ట్‌కు పంపాము. ఎంపీడీవో ఆత్మహత్య చేసుకోవటానికి గల కారణాలు దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.' - ఆర్గంగాధర్ రావు, జిల్లా ఎస్పీ
నరసాపురం ఎంపీడీవో కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు - police search for Narasapuram mpdo