ETV Bharat / state

క్వార్టర్ మేటర్ - ఇస్తానన్న రూ.350 ఇవ్వకపోతే మండదా!: లోకేశ్​ ట్వీట్​ - LOKESH ON STONE ATTACK ON JAGAN - LOKESH ON STONE ATTACK ON JAGAN

NARA LOKESH TWEET ON STONE ATTACK ON JAGAN: జగన్​పై రాయి దాడి అంశంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్​ ట్వీట్​ చేశారు. ఇదంతా క్వార్టర్​ మేటర్​కు సంబంధించినదేనని ట్వీట్​లో తెలిపారు. ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోతే ఎవరికైనా మండదా అంటూ అన్నారు.

lokesh
lokesh
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 1:24 PM IST

Updated : Apr 16, 2024, 2:44 PM IST

NARA LOKESH ON STONE ATTACK ON JAGAN : ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి కేసులో ఐదుమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అజిత్‌సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకులుగా అనుమానిస్తున్న పోలీసులు స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్​ ఆధ్వర్యంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని సీసీఎస్​ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఈ విషయంపై టీడీపీ నేతలు స్పందించారు.

మండదా అక్కా! మండదా అన్నా! : ముఖ్యమంత్రి జగన్​మోహన్​పై రాయి దాడి అంశంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్​ ట్వీట్​ చేశారు. క్వార్టర్ మేటర్ దగ్గరే జగన్​పై దాడి జరిగిందంటూ లోకేశ్ సెటైర్లు వేశారు. క్వార్టర్ మందుతో పాటు ఇస్తానన్న 350 ఇవ్వనందుకే దాడి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "మండదా అక్కా! మండదా చెల్లీ! మండదా తమ్ముడు! మండదా అన్నా!" అంటూ జగన్ ప్రసంగం డైలాగులనే ఆయన ఎక్స్​లో పోస్ట్ చేశారు. "కోడికత్తి డ్రామా 2 (KodiKathiDrama2) " వైఎస్సార్సీపీ అంతం అంటూ పోస్ట్ చేశారు.

జగన్​పై గులకరాయి దాడి కేసులో పురోగతి - పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు - stone Attack on Jagan

TDP Spokesperson Pattabhi Comments on Stone Attack on Jagan : ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గులకరాయి డ్రామాపై సీబీఐ విచారణ చేయిస్తామని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ స్పష్టం చేశారు. నిన్నటి వరకు ఆధారాలే లేవన్న పోలీసులకు తెల్లారే సరికి నిందితులు ఎలా దొరికారని అనుమానం వ్యక్తం చేశారు.

Stone Attack on CM Jagan : అసలు రాయే దొరకలేదని, అగంతకుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2లక్షల బహుమానం ఇస్తామని సోమవారం ప్రకటించారు. మంగళవారానికి రాయి వేసిన వ్యక్తి దొరికారని అంటున్నారని అన్నారు. జగన్​కు తొత్తులుగా కొందరు అధికారులు గులకరాయి నాటకాన్ని రక్తి కట్టించాలని చూస్తున్నారని పట్టాభి ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ డ్రామాపై ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక సీబీఐతో విచారణ జరిపిస్తామని తెలిపారు. ఆ రోజు ఈ పథక రచనలో భాగస్వాములైన వాళ్లు ముద్దాయిలుగా బోన్​లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని పట్టాభి హెచ్చరించారు.

గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు - రాళ్ల దాడి ఘటనలపై ఫిర్యాదు - NDA Leaders Complaint to Governor

ఎన్నికల వేళ జగన్ కొత్త డ్రామా - గులకరాయిదాడి కుట్రలో భాగమే: బుచ్చయ్య చౌదరి - Stone Attack On CM Jagan

Last Updated : Apr 16, 2024, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.