ETV Bharat / state

వాట్సప్ ద్వారా 153 సేవలు - సమాచారమంతా ఒకే వెబ్‌సైట్​లో - 153 SERVICES THROUGH WHATSAPP

వాట్సప్ గవర్నెన్స్‌పై కలెక్టర్ల సదస్సులో సమీక్ష - వాట్సప్ ద్వారా 153 పౌరసేవలు అందించేలా కార్యాచరణ సిద్ధం చేశామన్న లోకేశ్

Nara_Lokesh_Presentation
Nara Lokesh Presentation in Collectors Conference (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2024, 8:37 PM IST

Lokesh Presentation in Collectors Conference: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతుల స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సప్‌ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సప్‌ నంబర్‌ను త్వరలో ప్రకటించనుంది. ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్‌ ట్యాగ్‌ (టిక్‌ మార్క్‌) ఉంటుంది. ఈ నంబరు వన్‌స్టాప్‌ సెంటర్‌లా పనిచేస్తుంది. తొలిదశలో ఇందులో 153 రకాల సేవలు అందించనున్నారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్తృతం చేయనున్నారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా ఆర్‌టీజీఎస్‌ సీఈఓ దినేష్‌కుమార్‌ ఈ సేవలపై ప్రజంటేషన్‌ సమర్పించారు.

ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే ఈ వాట్సప్‌ ఖాతా ద్వారా ఈ విధంగా పంపిస్తుంది.

1. భారీవర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నాం.

2. మీ ప్రాంతంలో విద్యుత్తు సబ్‌స్టేషన్ల మరమ్మతుల కారణంగా ఫలానా సమయంలో విద్యుత్తు సరఫరా ఉండదు.

3. వైరస్‌లు వ్యాప్తిలో ఉన్నందున ఈ జాగ్రత్తలు తీసుకోండి.

4. మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశముంది. అప్రమత్తంగా ఉండండి.

5. మీ ప్రాంతంలో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇటువంటి సమాచారం కోట్లమందికి ఒకేసారి చేరవేస్తారు.

వినతుల స్వీకరణ, పరిష్కారం

ప్రజలు తమ సమస్యలపై వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే ఈ నంబరుకు మెసేజ్‌ చేస్తే వెంటనే వారికి ఒక లింక్‌ వస్తుంది. అందులో సంబంధిత వ్యక్తి పేరు, ఫోన్‌ నంబరు, చిరునామా పొందుపరిచి ఫిర్యాదులను టైప్‌ చేస్తే సరిపోతుంది. వెంటనే వారికి ఒక రిఫరెన్స్‌ నంబరు వస్తుంది. దాని ఆధారంగా తాము ఇచ్చిన వినతి పరిష్కారం ఎంతవరకూ వచ్చింది? ఎవరివద్ద ఉందనే సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తమ పరిధిలో మురుగు కాలవల లీకేజీలు, రోడ్లు గుంతలు వంటివి ఫొటోలు తీసి పెట్టొచ్చు. వాతావరణ కాలుష్యంపైనా ఫిర్యాదులు చేయొచ్చు.

రేషన్ బియ్యం అక్రమాలు జరిగేందుకు వీల్లేదు - సీఎం చంద్రబాబు హెచ్చరిక

ప్రభుత్వ పథకాల సమాచారం

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అర్హతలు, పథకాల లబ్ధి గురించి ఈ వాట్సప్‌ నంబరుకు మెసేజ్‌ చేసి తెలుసుకోవచ్చు.

పర్యాటక ప్రదేశాల సమాచారం

రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని ప్రజలకు వాట్సప్‌లో పంపిస్తారు. అందులో నుంచి మీకు కావాల్సిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని, అక్కడే టికెట్లు, వసతి సహా అన్ని బుక్‌ చేసుకోగలరు.

విశాఖలో గూగుల్‌ పెట్టుబడులు - ఏపీ ప్రభుత్వంతో కీలక ఒప్పందం

విద్యుత్తు బిల్లులు, పన్నుల చెల్లింపు

విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నులు ఈ అధికారిక వాట్సప్‌ ద్వారా చెల్లించొచ్చు. ట్రేడ్‌ లైసెన్సులు పొందొచ్చు. దేవాలయాల్లో దర్శనాల స్లాట్‌ బుకింగ్, వసతి బుకింగ్, విరాళాలు పంపడం వంటివి చేయొచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్‌ రికార్డుల యాక్సెస్, వివిధ సర్టిఫికెట్లు పొందొచ్చు.

చట్టబద్ధత కల్పించాలి : చంద్రబాబు

వాట్సప్‌ సేవల ద్వారా జారీచేసే పత్రాలకు చట్టబద్ధత ఉండేలా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వాట్సప్‌ ద్వారా వచ్చే వినతులు, అందిస్తున్న పౌరసేవలపై ఎప్పటికప్పుడు ఎనలిటిక్స్‌ సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

ప్రపంచస్థాయి వసతులతో ఏపీ మారిటైమ్ పాలసీ - ప్రపంచంలోని 20 భారీ పోర్టుల్లో ఒకటి ఇక్కడే

పది రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి - ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌

దేశంలోనే తొలిసారిగా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సంబంధించిన 153 రకాల పౌరసేవలను వాట్సప్‌ ద్వారా అందించనున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించామని, పదిరోజుల్లో పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ‘వాట్సప్‌ గవర్నెన్స్‌’పై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘‘ఒకే ఒక్క వాట్సప్‌ నంబరుకు సందేశం పంపించడం ద్వారా జనన, మరణ, కుల ధ్రువీకరణ పత్రాలు సహా.. అనేక సేవలు పొందొచ్చు. ధ్రువీకరణ పత్రాలను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా స్కాన్‌ చేసుకునేందుకు అవకాశముంది’’ అని లోకేశ్‌ వివరించారు. ఇతర ప్రధానాంశాలివి.

  • అన్ని ప్రభుత్వ సేవలను ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా పొందొచ్చు. సెర్చ్‌బార్‌లో ఏది వెతికినా అక్కడే వచ్చేస్తుంది.
  • ప్రస్తుతం ప్రపంచంలో యూఏఈ మాత్రమే ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్నిరకాల పౌరసేవలు అందిస్తోంది. దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారి ఇలాంటి సేవలందిస్తున్నాం.
  • విద్యా శాఖ తరఫున అపార్‌ ఐడీ నమోదు ప్రారంభించి.. 80% నమోదు పూర్తిచేశాక జనన ధ్రువీకరణ పత్రాల సమస్య తలెత్తింది. దీంతో ఆ ప్రక్రియను రీ ఇంజినీరింగ్‌ చేస్తున్నాం. అదే తరహాలో అధికారుల క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి వాటి రీ ఇంజినీరింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి.

వాట్సప్​లోనే అన్ని సర్టిఫికెట్లు - "మెటా"తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.