ETV Bharat / state

తన వాహనాన్ని పదే పదే తనిఖీ చేయడంపై లోకేశ్ అసహనం- అధికారుల తీరుపై అచ్చెన్న ఆగ్రహం - Police Inspected Nara Lokesh Convoy - POLICE INSPECTED NARA LOKESH CONVOY

Nara Lokesh Convoy Vehicles Searched several times: ఎన్నికల కోడ్ నేపథ్యంలో నారా లోకేశ్ వాహనాన్ని ఒక్క రోజే రెండు సార్లు తనిఖీ చేశారు. తనిఖీలకు సహరించిన లోకేశ్ అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని తనిఖీలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ నాయకుల వాహనాలను ఎందుకు తనిఖీ చేయడం లేదని ప్రశ్నించారు.

Nara Lokesh Convoy
Nara Lokesh Convoy
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 8:25 PM IST

Nara Lokesh Convoy Vehicles Searched several times: ఉండవల్లి కరకట్ట వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్ ను పోలీసులు ఒకే రోజు రెండు సార్లు తనిఖీ చేశారు. గత మూడు రోజుల్లో నాలుగు సార్లు లోకేశ్ కాన్వాయ్ ను ఆపి సోదాలు నిర్వహించారు. కోడ్ అమలు లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేశ్​కు చెప్పిన పోలీసులు కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేశారు. వాహనం దిగి లోకేశ్ తనిఖీలకు సహకరించారు.

వైసీపీ నేతల కార్లు మాత్రం తనిఖీ చేయడం లేదు: ఒకే రోజు రెండు సార్లు తన కాన్వాయ్​ వాహనాల తనిఖీపై లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేశ్ (Nara Lokesh) , వైసీపీ నేతల కార్లు ఎందుకు ఆపి సోదాలు చేయడం లేదని పోలీసుల్ని ప్రశ్నించారు. కేవలం టీడీీపీ నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అని నిలదీశారు. మంగళగిరి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న లోకేశ్ కాన్వాయ్ ను ఆపి తనిఖీలు నిర్వహించారు. కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని స్పష్టం పోలీసులు నిర్దారించుకున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేశ్ ప్రచారం సాగుతోందని పోలీసు అధికారులు నిర్ధారించారు.

టీడీపీ అధికారంలోకి వస్తే గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించేస్తాం: నారా లోకేశ్

తనిఖీలపై స్పందించిన అచ్చెన్నాయుడు: గత మూడు రోజుల్లో నాలుగుసార్లు నారా లోకేశ్ కాన్వాయ్‌ను ఆపి తనిఖీ చేయడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేశ్ ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. మార్చి 20 న ఉదయం 8 గంటలకు, 23న ఉదయం 8 గంటలకు, ఈరోజు ఉండవల్లి కరకట్ట వద్ద ఉదయం 8.10 కి, సాయంత్రం 5 గంటలకు లోకేశ్ కాన్వాయ్ ఆపి తనిఖీలు చేశారని తెలిపారు. కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని చెబుతున్నారని, కేవలం లోకేశ్ వాహనాలను మాత్రమే ఆపాలని పోలీసులకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అని నిలదీశారు. వైకాపా ముఖ్య నాయకుల కాన్వయ్‌లు ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికీ మంగళగిరిలో జగన్ రెడ్డి బొమ్మలు ఎన్నికల నియమావళికి విరుద్దంగా ఉన్నా ఎందుకు తొలగించలేదని ధ్వజమెత్తారు. మంగళగిరి పోలీసులు తాడేపల్లి ఆదేశాల పరంగా నడుచుకోవడం మానుకోవాలని హితవు పలికారు.

కరకట్ట వద్ద లోకేశ్​ కాన్వాయ్‌లో తనిఖీలు - కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని వెల్లడి - Police Checking Lokesh Convoy

లోకేశ్ వాహనాన్ని మాత్రమే ఆపాలని ఏమైనా ఆదేశాలు ఉన్నాయా?: అచ్చెన్నాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.