ETV Bharat / state

కూటమి ఘన విజయంతో ఎమ్మార్పీఎస్ సంబరాలు- నేతల హర్షాతిరేకాలు - MRPS leaders celebrations - MRPS LEADERS CELEBRATIONS

MRPS Leaders Celebrations of Winning Alliance : రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జగన్ అరాచక పాలన నుంచి రాష్ట్రానికి ఉపశమనం లభించింది అన్నారు. వెనుకబడిన వర్గాల వారికి టీడీపీ ప్రాధాన్యత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే విధంగా తమ సామాజిక వర్గానికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

MRPS Leaders Celebrations of Winning Alliance
MRPS Leaders Celebrations of Winning Alliance (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 5, 2024, 5:47 PM IST

MRPS Leaders Celebrations of Winning Alliance : రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరు పోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో జగన్ అరాచక పాలన నుంచి రాష్ట్రానికి ఉపశమనం లభించింది అన్నారు. 'ఎన్డీయే కూటమి గెలుపు - మాదిగల గెలుపు' నినాదంతో ఎన్నికల్లో ప్రచారాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించామని గుర్తుచేశారు. అఖండ విజయం సాధించిన కూటమి నాయకులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. వెనుకబడిన వర్గాల వారికి టీడీపీ ఈ ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే విధంగా తమ సామాజిక వర్గానికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తారని ఆశిస్తున్నామని వెంకటేశ్వర రావు పేర్కొన్నారు.

దేవుడు స్క్రిప్ట్ ఇదే - వైఎస్సార్సీపీకి 11 సీట్లు ఎలా వచ్చాయంటే? - YS Jagan God Script AP Politics Trolls

కూటమి అభ్యర్థుల ఘన విజయంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో కూటమి అభ్యర్థులు అన్ని స్థానాల్లోనూ గెలుపొందడంతో బాణసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు. కూటమి అభ్యర్థుల గెలుపుతో బాపట్ల జిల్లాలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాపట్ల పార్లమెంట్ స్థానంతో పాటు, బాపట్ల, వేమూరు, రేపల్లె, చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో టీడీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టుకున్నారు. జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్ నిడదవోలులో ప్రసిద్ధ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువులో జనసేన, టీడీపీ నాయకులు కేక్‌ కట్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సోమప్ప కూడలి వద్ద కూటమి శ్రేణులు ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం కౌంటింగ్ కేంద్రాల వద్ద కూటమి అభ్యర్థులు, శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ విజయం సాధించటంతో ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి, సంబరాలు చేసుకున్నారు.

చంద్రబాబును కలవడానికి పోటీపడుతున్న అధికారులు, నాయకులు - Govt Officers Meet Chandrababu

అన్నమయ్య జిల్లాలో రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు నియోజకవర్గాలలో మూడు చోట్ల కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో టీడీపీ నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి. నంద్యాల పార్లమెంటు టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు విజయకేతనంతో ఆయనకు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పిఠాపురం లో పవన్ కళ్యాణ్ విజయంపై కార్యకర్తలు, అభిమానులు సందడి చేశారు.

'అద్భుత విజయాన్ని అందించిన అశేష ప్రజానీకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు' - Nara Lokesh On NDA Success in election results

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.