Movement among Officials on Diarrhea Prevention Measures: డయేరియా నివారణా చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. డయేరియా కట్టడిపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు రక్షిత తాగునీరు అందించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. మంచినీటి పైపులైన్లు, ఓహెచ్ఎస్ఆర్ లీకేజీలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. 217 నీటి వనరులలో కాలుష్యం ఉన్నట్టు గుర్తించినట్టు వెల్లడించారు. జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమం నిర్వహించాలన్నారు.
డయేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సీఎస్ ఆదేశించారు. పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గత నాలుగు నెలల కాలంలో గుంటూరు, విజయవాడ, కాకినాడ, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో డయేరియా ప్రబలిందని స్పష్టం చేశారు. అనేక మంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరడంపై సీఎస్ ఆరా తీశారు. ఫిబ్రవరిలో ఒక వ్యక్తి డయేరియాతో చనిపోయారని అధికారులకు గుర్తు చేసిన సీఎస్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనీ ఆదేశించారు.
రెండో రోజే శాసనసభకు రాకూడదని వైఎస్సార్సీపీ నిర్ణయం - YSRCP Not to Come Assembly
చర్యలపై జిల్లాల అధికారులకు దిశానిర్దేశం: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలిసి సమీక్ష నిర్వహించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. డయేరియా పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్లు నారాయణ తెలిపారు.
కలెక్టర్‌తో ఎమ్మెల్యే పరామర్శ: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, జిల్లా కలెక్టర్‌తో కలిసి పరామర్శించారు. అనంతరం డయేరియా కేసుల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సరైన చికిత్స అందించాలన్నారు. సుమారు 50మంది వాంతులు, విరోచనాలు కావడంతో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా కేసులు పెరగడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సూచించారు.
తొలిరోజు సందడిగా శాసన సభ- చంద్రబాబు, పవన్, జగన్ ఎలా స్పందించారంటే! - AP Assembly Sessions 2024
అసెంబ్లీలో తడబడిన జగన్ రెడ్డి- 'ఘోరఓటమి తరువాత ఇదే తొలిసారి - pulivendula mla ys jagan oath