MLA Balineni About Kottapatnam To Ongole Road Repair Works : ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీకి ప్రజలు, ప్రజా సమస్యలు గుర్తుకు వస్తున్నాయి. ఐదేళ్లలో కనీసం ప్రజా సమస్యలు వినడానికి కూడా ఆసక్తి చూపని నేతలు ప్రస్తుతం సొంత ఖర్చులతో రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేయిస్తున్నాం అంటూ ఊదరగొడుతూ ఆమాయక ప్రజలను మోసం చేస్తున్నారు.
కొత్తపట్నం నుంచి ఒంగోలు రహదారి: ప్రకాశం జిల్లా బకింగ్ హం కాలువపై ప్రధాన రహదారి పనులు ఐదేళ్లుగా నిలిచిపోయాయి. కొత్తపట్నం నుంచి ఒంగోలుకు వేళ్లే మార్గం మధ్యలో ఉన్న రహదారి సరిగాలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన పనుల సంబంధించిన బిల్లులను గుత్తేదారులకు సకాలంలో చెల్లించకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు. దీనిపై ప్రజలు ఎమ్మెల్యే (MLA) బాలినేని శ్రీనివాస రెడ్డికి అనేక సార్లు ఫిర్యాదు చేసినe పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లగా పట్టించుకోని వైఎస్సార్సీపీ నేతలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా రెండు రోజుల్లో వంతెనపై తారు రోడ్డు వేశారు. దీంతో ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజాసమస్యలు కనపడతాయా అని పలువురు విమర్శిస్తున్నారు. అయితే ఈ రోడ్డు కనీసం 4 నెలలైనe ఉంటుందా అని స్థానికుల్లో అనుమానాలు నెలకొన్నాయి.
ఏపీ ప్రభుత్వానికి సిగ్గు చేటు.. రాష్ట్రంలోని ఓ రహదారి మరమ్మతులు చేసిన ఒడిశా లారీ అసోసియేషన్
ప్రకాశం జిల్లా కొత్తపట్నం నుండి ఒంగోలుకు వెళ్లే మధ్య బకింగ్ హొం కెనాల్ వంతెనపై ప్రధాన రహదారి ఐదు ఏళ్లుగా పనులు నిలిచిపోయాయి. ఐదు ఏళ్లుగా వాహనదాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. జిల్లా కేంద్ర అయిన ఒంగోలుకు పోవాలి అంటే ఈ వంతెనపై రావాల్సి ఉంది. అయితే ఐదు సంవత్సరాలుగా వంతెన పనులు గుతేదారులకు సకాలంగా బిల్లు చెల్లించకపోవడం గుతేదారులు పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు.
ఏటిగట్టు రహదారికి మరమ్మతులు ప్రారంభం
"రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావటం జాప్యం అవ్వటంతో సొంత నిధులతో మరమ్మతులు చేయించాను". - బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే
రహదారుల అసంపూర్ణ మరమ్మతుల వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కొత్తపట్నం మండలంలో పదికి పైగా గ్రామాలు ఈ మార్గంలో ప్రయాణిస్తారు. అనేకసార్లు ఎమ్మెల్యే బాలినేని విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయింది. అయితే కొత్తపట్నంలో వైయస్ఆర్ 4వ ఆసరా సంబరాల సభలో బాలినేని శ్రీనివాస రెడ్డి గతంలో కూడా ప్రభుత్వం బిల్లు చెల్లించకపోవడంతో వంతెన పనులు కూడా తానే సొంత నిధులతో చేయించానని సభలో తెలిపారు. రోడ్డుకి ఇరువైపులా సైడ్ వాల్స్ వెయ్యకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాణ్యతలేని నాసిరకం పనులు చేయడంతో 4 నెలలైనా రోడ్డు ఉంటుందా అని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం ఐదు ఏళ్లుగా వదిలేసిన వంతెన పనులను హడావుడిగా రెండు రోజుల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా బాలినేని వంతెనపై తారు రోడ్డు వేయించారని పలువురు విమర్శిస్తున్నారు.
'మా ప్రాణాలు కాపాడండి' - రహదారుల దుస్థితిని నిరసిస్తూ బాధిత గ్రామస్థుల మానవహారం