ETV Bharat / state

బుడమేరుకు గండ్లు పడలేదు - ప్రజలు ఆందోళన చెందవద్దు: మంత్రి నారాయణ - Budameru Breach Fake News - BUDAMERU BREACH FAKE NEWS

Budameru Breach Fake News : బుడమేరుకు గండ్లు పడ్డాయని, మళ్లీ వరద వస్తుందనేది పూర్తిగా అవాస్తవమని, ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని మంత్రి నారాయణ తెలిపారు. వదంతులు చూసి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన హెచ్చరించారు.

Budameru Breach Fake News
Budameru Breach Fake News (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2024, 10:20 PM IST

Budameru Breach Fake News : విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్లీ బుడ మేరు వరద వస్తుందనేది కేవలం వదంతులు మాత్రమేనని మంత్రి నారాయణ స్పష్టంచేశారు. కొత్త రాజరాజేశ్వరీ పేట, జక్కంపూడి కాలనీలతో పాటు వివిధ ప్రాంతాల్లో వరద వస్తోందంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. బుడమేరు కట్ట మళ్లీ తెగింది అనేది పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, విజయవాడ నగరం పూర్తి భద్రంగా ఉందని స్పష్టంచేశారు.

బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ప్రకటించారు. బుడమేరుకు ఎలాంటి వరదనీరు రావటం లేదని స్పష్టం చేశారు. కొందరు ఆకతాయిలు ఈ తరహా వదంతుల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్టు గుర్తించామని కలెక్టర్ స్పష్టంచేశారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గండ్లు పూడ్చిన తరువాత బుడమేరు ఎలా ఉంది? - డ్రోన్ విజువల్స్ - Budameru Canal Breach Drone Visuals

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.