ETV Bharat / state

'ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్'​లో పాల్గొన్న మంత్రి లోకేశ్ - ఏపీలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం కసరత్తు

అమెరికాలో కొనసాగుతున్న మంత్రి నారా లోకేశ్ పర్యటన - వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ

minister-nara-lokesh-participated-in-it-serve-synergy-summit-in-america
minister-nara-lokesh-participated-in-it-serve-synergy-summit-in-america (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Minister Nara Lokesh Participated in IT Serve Synergy Summit in America : మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఆయన లాస్‌వెగాస్‌ నగరంలో నిర్వహించిన ఐటీ సర్వ్‌ సినర్జీ సమ్మిట్‌లో పాల్గొన్నారు. సమ్మిట్‌ ప్రాంగణంలో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఎండీ రేచల్‌, పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి, రెవేచర్‌ సీఈవో అశ్విన్‌భరత్‌, అలాగే సేల్స్‌ ఫోర్స్‌ ఏఐ సీఈవో క్లారా షియాతో మంత్రి నారా లోకేశ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతల గురించి వారికి వివరించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్‌ను లోకేశ్‌ కోరారు. సులభతరమైన పౌరసేవలకు సహకారం అందించాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేశారు. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు AWS నాయకత్వం ఉపకరిస్తుందని తెలిపారు. స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలులో AWS క్లౌడ్ సేవలు కీలకపాత్ర వహించే అవకాశాలున్నాయన్నారు.

నారా లోకేశ్ టూర్ అప్డేట్స్ - సత్య నాదెళ్ల, శంతను నారాయణ్‌తో భేటీ

ఏఐ, మిషన్ లెర్నింగ్ లో మీరు చూపిస్తున్న శ్రద్ధ, నిబద్ధతలు ఆంధ్రప్రదేశ్​ను ఏఐ ఇన్నొవేషన్ కేంద్రంగా మార్చాలన్న తమ ఆశయానికి ఊతమిస్తాయన్నారు. పునరుత్పాదక శక్తితో నడిచే క్లౌడ్ డేటా సెంటర్‌ల స్థిరత్వానికి AWS కట్టుబడి ఉండటం 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ 72 GW పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధించాలన్న మా లక్ష్యానికి అనుగుణంగా ఉందని తెలిపారు. స్థిరమైన క్లౌడ్ కార్యకలాపాలకు పునరుత్పాదక ఇంధనాన్ని అందించేందుకు రాష్ట్రంలో బలమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు భరోసానిస్తాయని లోకేశ్ తెలిపారు.

అదేవిధంగా రెవేచర్ సీఈవో(CEO) అశ్విన్ భరత్‌తో మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యారు. ఏపీలో టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాడానికి భాగస్వామ్యం వహించాలని కోరారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇతర డిమాండ్ ఉన్న ఐటీ నైపుణ్యాల్లో రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక కోడింగ్ బూట్ క్యాంప్‌లను అందించడానికి ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలతో కలసి పనిచేయాలని మంత్రి లోకేశ్ చెప్పారు.

టెస్లా ప్రధాన కార్యాలయంలో మంత్రి లోకేశ్ - పెట్టుబడుల వేటలో కీలక పరిణామం

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేశ్‌ అమెరికా పర్యటన - పారిశ్రామిక వేత్తలతో రౌండ్​టేబుల్ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.