ETV Bharat / state

ఐటీలో 5 లక్షల ఉద్యోగాలే మా టార్గెట్ : లోకేశ్‌

ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అనేది కూటమి ప్రభుత్వ నినాదం అన్న లోకేశ్

Lokesh on IT Development in AP
Lokesh on IT Development in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Lokesh on IT Development in AP : విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధిపై శాసనసభ్యుల ప్రశ్నలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని అనే నినాదం కూటమి ప్రభుత్వానిదని లోకేశ్ స్పష్టం చేశారు. ఏపీలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు తేవడమే తన టార్గెట్ అని చెప్పారు. అదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేస్తున్నామని వెల్లడించారు. విశాఖను ఐటీ హబ్​గా తీర్చిదిద్దుతామని గతంలోనే హామీ ఇచ్చామని గుర్తుచేశారు. దాని కోసమే డేటా సెంటర్ పాలసీని కూడా రూపకల్పన చేశామని ఆయన వివరించారు.

సమావేశాలు నిర్వహించాం : గత ప్రభుత్వ పాలనలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు సంబంధించిన ఒక్క కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదని లోకేశ్ విమర్శించారు. వైఎస్సార్సీపీ హయాంలోని ఐటీ మంత్రి గుడ్డూ-కోడి అంటూ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లో ఏపీ ఐటీ మంత్రి ఇలా ఉంటారా అంటూ కూడా గతంలో కొందరు మాట్లాడారన్నారు. గడచిన ఐదు నెలల్లో చాలా ఐటీ సంస్థలతో సమావేశాలు నిర్వహించామని లోకేశ్ తెలిపారు.

'మూడు నెలల్లో టీసీఎస్ సంస్థ విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది. విశాఖలో ఐటీ ఎకో సిస్టం ఏర్పాటు కోసం ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు చేస్తున్నాం. డేటా సెంటర్లు హైదరాబాద్, ముంబయి, చెన్నైలో మాత్రమే ఉన్నాయి. డేటా సెంటర్లపై 300 బిలియన్ డాలర్లు వ్యయం చేస్తున్నాం. టీడీపీ తెచ్చిన డేటా సెంటర్ పాలసీ ప్రకారం అవి వస్తే విశాఖ ప్రపంచ డేటా సెంటర్​ అయి ఉండేది.' అని లోకేశ్ పేర్కొన్నారు.

ఐటీ కంపెనీలు రావాలంటే సామాజిక మౌలిక సదుపాయాలు కూడా ఉండాలి. అందుకే భోగాపురం లాంటి అంతర్జాతీయ విమానాశ్రయం వేగంగా నిర్మిస్తున్నాం. అలాగే వేలాది హోటళ్లు కూడా ఏర్పాటు కావాల్సి ఉంటుంది. అందుకే టూరిజం పాలసీ కూడా రూపొందించాం, పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించాలని కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నాం. విశాఖకు గ్రేడే ఆఫీస్ స్పేస్, నివాస స్థలాలు కూడా ఉండాలని అందుకే రియల్ ఎస్టేట్ కంపెనీలతోనూ చర్చిస్తున్నాం. - నారా లోకేశ్, ఐటీ శాఖ మంత్రి

AP Assembly Sessions 2024 : మరోవైపు పెండింగ్ ఇన్సెంటివ్​లు చెల్లించేందుకు బడ్జెట్​లో రూ.500 కోట్లు కేటాయించామని లోకేశ్ వివరించారు. శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం ఐటీ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​పై దృష్టి పెట్టాలని టీసీఎస్ చంద్రశేఖరన్ చెప్పారని తెలిపారు. కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్లపై రిలయన్స్​కు అభినందనలు తెలియచేస్తే వారు రాష్ట్రంలో 700 యూనిట్లు పెడతామని హామీ ఇచ్చారని లోకేశ్ వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్న ఐటీ కంపెనీలను కూడా రాష్ట్రానికి ఆహ్వానించడంలో శాసనసభ్యులు కూడా సహకరించాలి. కంపెనీలు ఏపీకి తేవడం ఒక్క లోకేశ్ వల్లే సాధ్యం కాదు. అందరూ సహకరించాలి. ఆంధ్రప్రదేశ్​లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యం. టైర్ 2, 3 సిటీస్​లో కూడా ఐటీ స్పేస్ రావాల్సి ఉంది. అందుకే ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా కో వర్క్సింగ్ స్పేస్​ను కల్పించేలా కార్యాచరణ చేపట్టాం. - నారా లోకేశ్, ఐటీ శాఖ మంత్రి

'త్వరలోనే రాష్ట్రంలో ఐటీ పాలసీ కూడా తీసుకురానున్నాం. అదానీతో పాటు కొన్ని కంపెనీలు విశాఖకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. డేటా సెంటర్​లకు సంబంధించిన ఓ జాతీయస్థాయి ఫ్రేమ్ వర్క్ రూపకల్పన జరుగుతోంది. వచ్చే మూడు నెలల్లో విశాఖలోని ఐటీ హిల్స్​పై డేటా సెంటర్లు వస్తాయి. నిక్సీ సంస్థతో మాట్లాడుతున్నాం, సింగపూర్ నుంచి సీ ల్యాండింగ్ ఇంటర్నెట్ కేబుల్ తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం' అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

"టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాయలసీమ అభివృద్ధి చెందింది. సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం హయంలో వచ్చాయి. అప్పటి ఎన్డీఆర్ నుంచి ఇప్పటి చంద్రబాబు వరకూ వివిధ దఫాల్లో రాయలసీమకు పెట్టుబడులు, ప్రాజెక్టులు, అనంతపురానికి కియా వచ్చిందంటే ఎన్డీయే ప్రభుత్వం వల్లే. చిత్తూరు, కడప కడప కేంద్రంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు కూడా వచ్చాయి." - లోకేశ్, మంత్రి

టీసీఎల్, ఫాక్స్​కాన్ సంస్థలన్నీ రాయలసీమ ప్రాంతానికే వచ్చాయని లోకేశ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఐఐటీ సహా వివిధ సంస్థలు ఇక్కడ నెలకొల్పాయని గుర్తుచేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చామని, ఇందుకు సంబంధించి తీర్మానంతో పాటు వచ్చే ఏడాదిలోగా బెంచ్ ఏర్పాటు చేసేలా పనిచేస్తామని స్పష్టంచేశారు. మరోవైపు గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేకంగా మంత్రి వర్గ ఉపసంఘం నియమించారని వివరించారు. గంజాయిని అరికట్టడానికి సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టారని, దీనిపై అసెంబ్లీలో చర్చ జరగాలని లోకేశ్​ కోరారు.

పెండింగ్‌ పోస్టులన్నీ భర్తీ చేస్తాం - రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ పూర్తి : లోకేశ్

బ్రాండ్ ఏపీ కోసం మంత్రి లోకేశ్ కృషి - పెట్టుబడిదారుల్లో సరికొత్త జోష్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.