Minister Chelluboina Venugopal: సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు ప్రభుత్వ కార్యక్రమాలకు నిధుల విడుదల, ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ విరమణ వయస్సు పెంపు వంటి అంశాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి చెల్లుబోయిన వివరించారు.
ఫిబ్రవరి 16 తేదీన మహిళలకు చేయూత నాలుగో విడత నిధుల విడుదల అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు. 26.98 లక్షల మంది మహిళలకు చేయూత కింద 5 వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన వివవరించారు. గ్రామ సచివాలయాల ద్వారా, గ్రామ స్థాయి సంస్కరణ రాష్ట్రంలో అమలైందని ఆయన అన్నారు.
సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం - విద్యాశాఖలో ఖాళీల భర్తీకి ఆమోదం!
ఉద్యోగాల భర్తీకి కేబినేట్ ఆమోదం: 13 వేల 171 గ్రామ పంచాయతీల్లో గ్రేడ్ 5 కార్యదర్శుల నియామకానికి ఆమోదం తెలిపిందన్నారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. దీని ద్వారా 6,100 ఖాళీలను భర్తీకి నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అంతేకాకుండా టెట్ నిర్వహణకు ఆమోదం తెలిపినట్లు వివరించారు.
ఉద్యోగ విరమణ వయస్సు పెంపు: అటవీశాఖలోని ఖాళీలను సైతం భర్తీల ఖాళీల్లోనూ నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. ఈ నియామకాలను ఏపీ పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ పాఠ్యాంశాల కోసం కేబినెట్ ఆమోదించిందన్నారు. అన్ని పాఠశాలల్లోనూ ఐబీ సిలబస్ అమలుచేయనున్నట్లు తెలిపారు. విశ్వ విద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం - ₹552 కోట్ల రుణ సేకరణకు అనుమతి
రుణాలకు అనుమతిచ్చిన మంత్రి వర్గం: ఏపీ డిస్కంలు 1500 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు అనుమతులిచ్చినట్లు వివరించారు. గ్రీన్ కో, జిందాల్ నియో ఎనర్జీ సహా వివిధ సంస్థలకు, సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టు కోసం భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. సీలేరు వద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం, సహజ వాయువుపై పన్నును 24 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు వివరించారు. ఏపీ లెజిస్లేచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వెల్లడించారు.
"ఫిబ్రవరి 16న మహిళలకు నాలుగో విడత చేయూత నిధులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మెగా డీఎస్సీ ద్వారా 6100 పోస్టుల భర్తీకి, టెట్ పరీక్ష కూడా నిర్వహించేందుకు కేబినెట్ అనుమతి తెలిపింది. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి, ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ పాఠ్యాంశాలకు ఆమోదాన్ని ఇచ్చింది." - చెల్లుబోయిన వేణుగోపాల్, రాష్ట్ర మంత్రి
కృష్ణా జలాలపై వైసీపీ మంత్రి హుకుం - ఇలానే కొనసాగితే ఆ జిల్లాల్లో తాగునీటికే ముప్పు